Hair Tips : కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే చాలు తెల్ల‌జుట్టుకి స్వ‌స్తి..! జీవితంలో మ‌ళ్లీ తెల్ల‌జుట్టురాదు

Hair Tips : చిన్నతనంలోనే తెల్లజుట్టు రావడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని హోం రెమిడీస్ పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటం సాధారణంగా మారిపోయింది. కేవలం 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారిలోనూ ఇటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. తలపై తెల్ల జుట్టు రావటం పెద్ద ఆందోళనకు కారణంగా మారుతోంది. ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇది ఒక కారణం కావచ్చు. కానీ కొన్ని సార్లు మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి కారణ‌మ‌వుతుంది. కొంతమంది హెయిర్ డై వాడి జుట్టును నల్లగా మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే దీనివ‌ల‌న జుట్టు పొడిగా మారుతుంది. ఇటువంటి వారు తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

1. తెల్ల జుట్టు మళ్ళీ నల్లగా మారాలంటే ఏం చేయాలి… కొబ్బరి నూనె జుట్టు, కుదుళ్ళకు ముఖ్యమయిన ఔషధంగా పరిగణింపబడుతుంది. ఇది జుట్టును మెరిసేలా చేయడమే కాదు, జుట్టు రాలే సమస్యను. తగ్గిస్తుంది. అయితే ఈ కొబ్బరి నూనెలో నిమ్మరసం. కలిపితే.. ఇది చాలా సులభం. జుట్టు నల్లగా అవ్వడానికి జుట్టుకు అద్భుతమైన పోషణను కూడా అందిస్తుంది.

Hair Tips with coconut oil
Hair Tips with coconut oil

2. నిమ్మకాయ జుట్టుకు ఎందుకు ప్రయోజనకరమో చూద్దాం… నిమ్మకాయను జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఎందుకు వాడాలంటే దీంతో చుండ్రు సమస్య సులభంగా తొలగిపోతుంది. ఇది జుట్టు పెరిగేందుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న వ‌య‌సులోనే మీ జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే.. త‌రచుగా నిమ్మ‌కాయ ర‌సాన్ని అప్లై చేస్తుండాలి. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి.

3. ఇలా చేస్తే గ్రే హెయిర్ ను న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు : వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లబడటం సర్వసాధారణం.ఇలా చేస్తే చిన్న‌వ‌య‌సులోనే వ‌చ్చే తెల్లజుట్టును రాకుండా చేయ‌గ‌లం… నిమ్మకాయ,
కొబ్బరి నూనె సహాయంతో ఇది వాడటం చాలా ఈజీ అని చెప్పవచ్చు. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు మన జుట్టు మ‌ళ్లీ పెరగుతుంది. తెల్ల జుట్టు కణాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి స్కాల్ఫ్‌ నుంచి జుట్టు మొదళ్ల వరకు ప‌ట్టించాలి. ఇలా ప్ర‌తిరోజూ చేస్తుంటే రక్తప్రసరణ పెరిగి జుట్టు సహజంగా నల్లగా మారడం మొద‌ల‌వుతుంది.