Hair Tips : వద్దు బాబోయ్ అన్నా మీ జుట్టు పెరిగిపోతుంది.. ఈ ఆయిల్ అర్జెంటుగా కొనుక్కోండి!

Hair Tips : ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో జుట్టు రాలటం, తెల్ల వెంట్రుకలు రావడం, దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ నుఉపయోగిస్తున్నారు. ఈ ప్రొడక్ట్స్ జుట్టుకి చాలా హానిని కలిగిస్తాయి. చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలుకూడా తగ్గుతాయి. ముందుగా దీనికోసం మనం అల్లం తీసుకొని తొక్క తీసుకోవాలి. దాని తర్వాత గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా కలిగి ఉంటుంది.

ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా, ఒత్తుగా పెరగడంలో సహాయపడతాయి. తెల్ల వెంట్రుకలను తగ్గించి ఒత్తుగా, నల్లగా రావడంలో సహాయపడతాయి. దీని తరువాత ఈ ఆయిల్ కోసం రెండు చెంచాల లవంగాలను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. లవంగాలు జుట్టును పొడవుగా, సిల్కీగా పెరగడంలో సహాయపడతాయి. లవంగాలలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంవల్ల దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. స్కాల్ప్ పై ఉండే ఇన్ఫెక్షన్ తగ్గడం వలన జుట్టు కుదుళ్ళు బలంగా తయారయ్యి జుట్టు రాలడం తగ్గి పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల లవంగాల పొడిని వేసుకోవాలి. ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్న అన్నం కూడా దీనిలో వేసుకోవాలి.

Hair Tips on Take spoonfuls of cloves and grind them into fine powder
Hair Tips on Take spoonfuls of cloves and grind them into fine powder

దీని తర్వాత ఒక బౌల్ కొబ్బరి నూనెను వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి స్టవ్ పై పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. అల్లం లో ఉండే తడి మొత్తం ఇంకిపోయేంతవరకు ఆ నూనెను మరుగనివ్వాలి. దీని తర్వాత స్టవ్ ను ఆఫ్ చేసి నూనెను చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత నూనెను వడగట్టుకుని ఒక స్పూన్ కాస్టర్ ఆయిల్ లేదా విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె ఏదైనా గాజు సీసాలో నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను అప్లై చేసుకోవడానికి ముందు డబ్బులు బాయిలర్ పద్ధతిలో నూనెను వేడి చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ల దగ్గర నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. నూనెను అప్లై చేసిన తర్వాత కనీసం నాలుగు గంటల పాటు ఉండనివ్వాలి. లేనట్లయితే రాత్రి అప్లై చేసుకొని ఉదయం లేచిన వెంటనే తల స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పొడవుగా,ఒత్తుగా పెరుగుతుంది.దురద,చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.