Hair Tips : మహిళలకు కురులు అందాన్ని తీసుకొస్తాయని చెప్పడంలో సందేహం లేదు.. ముఖ్యంగా అమ్మాయికి జుట్టు ఎంత ఒత్తుగా, పొడవుగా, సిల్కీగా ఉంటే అంత అందంగా కనిపిస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా అబ్బాయిలు సైతం అమ్మాయిల జుట్టు చూసి ఆకర్షితులవుతారు అనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో చాలామంది పని ఒత్తిడి , ఇతర పనుల కారణంగా తమ జుట్టు పైన ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు . ఫలితంగా జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం, చుండ్రు ఇలా మొదలైన సమస్యలు తలెత్తుతూ ఉండడం జరుగుతుంది. ఇకపోతే వీటిని దూరం చేసుకోవాలి అంటే ఎన్నో ఉత్పత్తులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని బ్యూటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే సహజ సిద్ధంగా తయారు చేసుకునే ఇంటి రెమెడీలను మాత్రమే ఉపయోగించాలి అని అప్పుడే మీ జుట్టు సహజంగా ఒత్తుగా, పొడవుగా చాలా అందంగా పెరుగుతుంది అంటూ కూడా సలహా ఇస్తూ ఉండడం గమనార్హం. మరి పొడవైన , అందమైన జుట్టు కావాలి అంటే ఎలాంటి ఇంటి చిట్కాను పాటించాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ప్రస్తుతం మీకు మార్కెట్లో ఆమ్లా పౌడర్, గోరింటాకు పౌడర్, మెంతి పౌడర్, నీలగిరి పౌడర్ ల రూపంలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ పొడులన్నింటిని మీరు ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది. మీ జుట్టు కోసం తయారు చేసే హోమ్ రెమిడి కి కావలసిన పదార్థాలు..
ఒక బౌల్ తీసుకొని అందులో మీ జుట్టుకు సరిపడా రెండు టేబుల్ స్పూన్లు చొప్పున.. మెంతి పొడి, గోరింటాకు పొడి, ఉసిరి పొడి తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కూడా వేయాలి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో నీళ్లు పోసి రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి బాగా డికాషన్ తయారు చేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పౌడర్ లోకి ఈ నీళ్లు పోస్తూ కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ కు ఒక పాలిథిన్ కవరు కప్పి రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే మీ జుట్టును పాయలుగా విడదీసి జుట్టు మొదలు నుంచి కొనాల వరకు అప్లై చేసి అరగంట ఆగిన తర్వాత తలస్నానం చేయాలి. అయితే తల స్నానం చేసేటప్పుడు షాంపూ ఉపయోగించకూడదు అని గుర్తించుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు పాటించారంటే ఆరు వారాలు తిరగక ముందే మీ జుట్టు చాలా అందంగా ఒత్తుగా పొడవుగా పెరగడం మీరే గమనిస్తారు.