Hair Tips : అమ్మాయి కైనా.. అబ్బాయి కైనా ఒత్తయినా జుట్టువల్ల వారి అందం మరింత పెరుగుతుంది. అందరూ జుట్టు ఒత్తుగా,సిల్కీగా కావాలనుకుంటారు.అయితే ఒక్కొరి జుట్టు తత్త్వం ఒక్కోలాగా ఉంటుంది.కొంతమంది జుట్టు చాలా సన్నగా, పల్చగా, మృదువుగా ఉంటుంది.వీరు ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు.కానీ పల్చని జుట్టు కలవారు కొన్ని పనులు వల్ల వారి జుట్టు ఆరోగ్యం దెబ్బతిని, జుట్టు ఇంకా పల్చగా తయారవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1.వేడి స్టైలింగ్ టూల్స్ ను వాడకూడదు. కొంతమంది పల్చగా, స్ట్రైట్ గా వున్న జుట్టును రింగులుగా మార్చుకోవాలని,జుట్టుకు హీట్ పరికరాలు ఉపయోగిస్తుంటారు. అలా వాడటం వల్ల ఆ హీట్ కి జుట్టు పాడై, ఇంకా ఎక్కువగా రాలిపోతుంది. తప్పనిసరిగా వాడాలనుకునేవారు కండిషనర్ కానీ, సీరమ్ కానీ వాడితే కొంతవరకు జుట్టు కాపాడుకోవచ్చు.
2. కాటన్ దిండ్లు వాడకూడదు.. ఎక్కువ పత్తి తో చేసిన దిండ్లను వాడితే,జుట్టు ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కావున పత్తికి బదులుగా సిల్క్ దిండ్లు వాడితే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
3. ఎక్కువ లైటింగ్ కు దూరంగా ఉండాలి.. ఇప్పుడున్న జీవనవిధానంలో ఎక్కువగా లైట్ లా కిందే ఉంటున్నాము. దీని వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతిటుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసే విదంగా లైట్ కింద ఉండకూడదు..
4. సల్ఫేట్స్ ఉన్న ఉత్పత్తులను వాడొద్దు జుట్టు ఆరోగ్యం కోసం సల్ఫేట్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడకూడదు. సల్ఫేట్ లేని షాంపూలను వాడటం వల్ల జుట్టును సంరక్షించుకోవచ్చు.షాంపూ తర్వాత, కండిషనర్ తప్పక వాడాలి.
5. రోజూ షాంపూ చేయొద్దు రోజూ తలస్నానం చేసేవారు డైలీ షాంపూ పెట్టకూడదు. దీని వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది. జుట్టు లో కల సహజ నూనెలు తొలగిపోతాయి. దీని వల్ల జుట్టు పొడిబారి, అందవిహీనంగా తయారవుతుంది.
6. బ్లో డ్రైయర్‌ని ఎక్కువగా వాడొద్దు జుట్టు ఆరబెట్టడానికి బ్లో డ్రయర్ వాడుతుంటాము. ఎక్కువగా ఇది వాడిన జుట్టు పొడిబారి, చివర్ల పగిలినట్టు అయి, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
7. గట్టిగా జుట్టు ముడి వేయకూడదు. పల్చని వెంట్రుకలతో గట్టిగా ముడి వేయకూడదు. జుట్టును గట్టిగా పట్టి లాగడం వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని, రాలిపోతుంది.
8.ఎక్కువ ఉత్పత్తులను వాడొద్దు హెయిర్ కోసం రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల జుట్టు సహజత్వం కోల్పోయి, చుండ్రు, రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి.
కాబట్టి పల్చని జుట్టు కలవారు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.