Hair Tips : చుండ్రు బాగా పెరిగిపోయిందా – ఎంత గట్టి చుండ్రు ఐనా ఇలా చేస్తే వారంలో మటాష్ !

Hair Tips : ఇటీవల కాలంలో చాలామంది అనేక రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలు రావడానికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. అందులో ఒకటి మన శరీరంలోని వేడి కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. ఇంకొకటి వాతవరణ కాలుష్యం. వీటి కారణంగా చుండ్రు సమస్య వస్తుంది. దీనివల్ల చిరాకు, జుట్టు రాలడానికి ప్రధాన కారణమవుతుంది. ఈ సమస్య రావడానికి దీర్ఘకాలిక సమస్యలు, ఒత్తిడి, మానసిక ఆందోళన, పోషకాహార లోపం వంటి సమస్యలు చుండ్రు రావడానికి కారమవుతున్నాయి. ఇలాంటి టైంలో చుండ్రు తగ్గించి, జుట్టుకు పోషణను ఇవ్వడానికి హెయిర్ ఫ్యాక్ని వాడడం మంచిది.మార్కెట్లో దొరికే హెయిర్ ప్యాకులు వాడడం వల్ల జుట్టుకు మంచి జరగక పోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇంట్లోనే దొరికే వాటితోనే హెయిర్ ప్యాకును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవచ్చే ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పెరుగు నిమ్మరసంతో.. నిమ్మరసాన్ని హెన్నా పౌడర్లో రెండు స్పూనులు వేసి దీనికి తగినంత పెరుగును కలిపి ఉండలు లేకుండా బాగా కలపాలి. కలిపిన తరువాత దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారం లేదా పదిహేను రోజులకొకసారి వాడడం వల్ల చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. నూనెతో కూడా కొబ్బరినూనె, వేపనూనెలను కలిపి తయారుచేసే హెయిర్ ఆయిల్ని వాడితే జుట్టుకు చాలా మంచిది. ఇదేకాక, కొబ్బరినూనె, ఆముదం నూనెలను సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. దీనిని చల్లారాక జుట్టుకు బాగా మర్దనా చేయాలి. దీంతో చుండ్రు సమస్య పోతుంది. అంతేకాక జుట్టుకు పోషణ దొరుకుతుంది. ఆవెనూనె కూడా చుండ్రు సమస్యను. పోగొడుతుంది.

Advertisement
Hair Tips on curd lemon juice
Hair Tips on curd lemon juice

ఆవనూనెను ఒక గిన్నెలోకి తీసుకొని వేడిచేయాలి. నూనె వేడి అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిలో మెంతులు, గోరింటాకు ఆకులు వేయాలి. నూనె చల్లారాక వడకట్టుకోవాలి. ఈ నూనెను తలస్నానం చేయడానికి ఒక గంట ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి హోం మేడ్ షాంపూతో తలస్నానం చేయాలి. మందారం తో ఎండబెట్టి పౌడర్ చేసిన మందార పూలు, ఆకుల పౌడర్లో హెన్నా పొడిని వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఉసిరి పొడి, మెంతుల పొడిని కలపాలి. కలిపిన తర్వాత దీనిలో పుల్లని పెరుగును వేసి చిక్కగా కలుపుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే చుండ్రు సమస్య తగ్గుతుంది.

మెంతులతో.. మెంతులు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాక జుట్టు ను సంరక్షించడానికి కూడా దోహదపడతాయి. ఈ మెంతులను కొన్ని రకాల హెయిర్ ప్యాక్ లలో వాడతారు. మెంతులను ఉపయోగించి చుండ్రు సమస్యను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.హెన్నా పొడిలో రెండు స్పూన్ల నిమ్మరసం, ఆలివ్ నూనె, వెనిగర్, మెంతి పొడి వేసి బాగా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని తర్వాత రోజున జుట్టుకు బాగా పట్టించి రెండు గంటల పాటు అలా వదిలెయ్యాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనం దొరుకుతుంది.

Advertisement