Hair Tips : జుట్టు పట్టుకుచ్చులా మెరవాలని ఎవరు కోరుకోరూ చెప్పండి. ముఖ్యంగా ఆడవారు తమ అందంలో భాగంగా వారి జుట్టుకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు జుట్టు ఒత్తుగా,నిగనిగలాడేందుకు లేదా దృఢంగా మార్చుకోవడానికి ఎలాంటి ఖరీదైన షాంపూ, ఆయిల్ కొనుగోలు చేయనవసరం లేకుండా కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు..తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గుడ్డు : గుడ్డులో ఎన్నో రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ పుష్కళంగా దొరుకుతాయి. అది శరీర ఆరోగ్యానికే కాక జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. జుట్టుకీ గుడ్డునీ లేపణంగా వేయడం వలన జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాని కోసం ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకొని,బాగా కలపి జుట్టు కుదుళ్ల నుంచి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటే జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉంటుంది.
నారింజ : ఆరెంజ్ లో ఉండే సి విటమిన్ చుండ్రు మరియు జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది. ఆరెంజ్ జ్యూస్, అలీవ్ ఆయిల్ మరియు యాపిల్ జ్యూస్ మిక్స్ చేసి తలకు అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూ తో శుభ్రం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అవిసె గింజలు : అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు లోపలి నుంచి దృఢంగా తయారవుతాయి. కొంతమంది కి జుట్టు పీచులా నిర్జీవంగా ఉంటుంది. అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుప్పెడు అవిసె గింజలను తీసుకుని నీటిలో నాలుగయిదు రోజులు నానబెట్టి, ఈ నీటిని నేరుగా దూదితో జుట్టు కుదుళ్లకు పట్టించి బాగా మర్దన చేసి, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం ఎంతో మెరుగువుతుంది.
జామకాయ : జామకాయలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ జుట్టును మెరిసేలా చేస్తాయి. జామకాయ రసాన్ని రాత్రి పూట తలకు పట్టించి ఉదయాన్నే షీకాయతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అవకాడో : అవోకాడో లో విటమిన్లు A, B మరియు ఈ లు ఎక్కువగా ఉండడం వల్ల జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అవకాడో మరియు అలీవ్ ఆయిల్ కలిపి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు కుదుళ్లకు అప్లై చేసి,అరగంట పాటు ఆరనిచ్చి, తలస్నానం చేయాలి.ఇది బలమైన జుట్టు పెరగడానికి, మెరిసేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.