Hair Tips : జుట్టు విరిగిపోతోందా.. అయితే ఈ చిట్కా పాటించండి.!!

Hair Tips : జుట్టు మధ్యలోకి విరిగిపోవడం..స్ప్లిట్ ఎండ్స్ సమస్య ఎక్కువవుతున్న నేపథ్యంలో జుట్టు ఎంత పొడుగు గా ఉన్నా సరే అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీటిని అనుసరించడం వల్ల సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు. ముఖ్యంగా అధిక వేడి, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోవడమే కాదు.. జుట్టు మధ్యలోకి విరిగిపోతుంది. దుమ్ము, ధూళి, ఎండ, కాలుష్యం , రసాయనాల వంటి కారణాల వల్ల ఇలాంటి నష్టం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో స్ప్లిట్ ఎండ్ సమస్య కూడా ఒకటి. ఇకపోతే ఈ సమస్యను నివారించడానికి నాణ్యమైన ఇంటి చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేంటో ఒక సారి తెలుసుకుందాం.

కోడిగుడ్డు : గుడ్డు జుట్టు చివర్లను సరిచేయడానికి అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనను బయటకు తీసి జుట్టు చివర అప్లై చేయడం వల్ల ఫలితం లభిస్తుంది. ముందుగా ఒక గుడ్డు లోని తెల్లసొనను తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె వేసి కొద్దిగా తేనె కూడా కలిపి 30 నిమిషాలపాటు పక్కన ఉంచాలి. ఇక దీనిని హెయిర్ మాస్క్ గా ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి.

Hair Tips in Shea butter papaya egg
Hair Tips in Shea butter papaya egg

షియా బట్టర్ : మీ జుట్టును కడిగిన తర్వాత వెన్న రాయడం వల్ల జుట్టు సహజంగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టుకి కావలసిన ప్రోటీన్ , కండిషనర్ రెండు లభిస్తాయి. అయితే దీనిని ఉపయోగించిన కొద్ది రోజుల్లోనే జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లిపోవడం లాంటి సమస్యలు తగ్గిపోవడం మీరే గమనిస్తారు.

బొప్పాయి : ఇతర పోషకాలతో పాటు విటమిన్ ఏ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇక ఇది సెబం ఉత్పత్తిని ప్రేరేపించి.. నష్టం రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఎదుగుదల మాత్రమే కాదు.. జుట్టు కొనలు కూడా బాగా పెరుగుతాయి. ఇక అలాగే కొబ్బరి నూనె కూడా చిట్లిపోయిన జుట్టు ను రిపేర్ చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.