Hair Tips : ఆరోగ్యకరవంతమైన, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నేటి జీవన శైలి కారణంగా చిన్న వయసునుంచే బట్టతల రావడం సర్వ సాధారణం. కానీ ఎక్కువగా జుట్టు రాలడానికి కారణం కొందరిలో అనారోగ్యం సమస్యలు అయితే మరి కొందరిలో పోషకాహార లోపం వంటి అనేక కారణాలున్నాయి. మన జుట్టును కాపాడుకునేందుకు, సహజంగా జుట్టు తిరిగి పెరగడానికి ఉపయోగపడే కొన్ని చికిత్సలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్కాల్ప్ మసాజ్ : రెగ్యులర్ స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే మనకి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది. దీనికోసం మనం నిత్యం వినియోగించే నూనెతో వారాని మూడు లేదా నాలుగు సార్లు జుట్టు కుదుళ్ల వరకు నూనె పట్టేలా మసాజ్ చేసుకోవాలి.
మీ జుట్టును కత్తిరించండి : పొడవాటి జుట్టు కావాలనుకుని ఒకటి లేదా రెండు సార్లు జుట్టును కత్తిరించి జుట్టు పెరగడం లేదని వదిలేస్తారు. అస్సలు అలా చేయకూడదని నిపుణుల సలహా… జట్టు చివర్లను కత్తిరించాలి అనుకుంటే ఒక నిర్థిష్ట కాల వ్యవధిలో జుట్టును కత్తిరించుకోవాలి. అలా కత్తిరించడం కొనసాగిస్తేనే ఉంటే కొన్ని నెలల తరువాత మీకు అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. ఒక సారి లేదా రెండు సార్లు కత్తిరించి వదిలేయడం వల్ల జుట్టు చివరన పల్చబడి విరిగొపోతుంటుంది.
పోషకాల తీసుకోవడం ముఖ్యం : మన శరీరంలాగే మన జుట్టుకు కూడా ఎదుగుదలకు పోషకాలు అవసరం. ప్రొటీన్‌తో పాటు, జుట్టు పెరుగుదలను పెంచడానికి మీరు తగినంత విటమిన్లను కూడా తీసుకోవాలి. బచ్చలికూర, గుడ్డులోని పచ్చసొన, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, చేపలు, జామ మరియు గింజలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
జుట్టు మీద రసాయనాల వాడకాన్ని తగ్గించండి : మార్కెట్లో జుట్టు పెరుగుదలకు సంబంధించి అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. మార్కెటింగ్ వారు మా ప్రొడక్ట్‌ను వాడితే పోయిన మీజుట్టు తిరిగి వస్తుందని, జుట్టు అధికంగా పెరుతుందంటారు. అవన్ని వాస్తవం కాదు. సాధారణ ప్రజలు తెలియక వాటిని వాడి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతుంటారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.