Hair Tips : జుట్టు చివర్లు చిట్లిపోయాయా.!? కత్తిరించకుండా ఇలా చేయండి..!

Hair Tips :  చలికాలంలో సాధారణ జుట్టు సమస్యలలో జుట్టు చివర్లు చిట్లిపోవడం కూడా ఒకటి.. వాతావరణ ప్రభావంతో పాటు రోజువారి మనం చేసే పనులు కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి.. జుట్టు చివర్లు కత్తిరించకుండా ఈ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..

Advertisement
Hair split ends to check these herbal packs
Hair split ends to check these herbal packs

కోడుగుడ్డు జుట్టు చివర్లను రిపేర్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కోడిగుడ్డు తెల్ల సొనలో ఒక చెంచా రోజ్ మేరీ ఆయిల్ ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. లేదంటే బొప్పాయి పండు గుజ్జులో కొద్దిగా పెరుగుని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి రాసుకొని గంట తర్వాత తలస్నానం చేయాలి. మీరు షాంపూతో తలస్నానం చేసే ముందు పాలలోని క్రీం తీసి జుట్టు చివర్లకు బాగా రాసుకోవాలి. ఆ తరువాత తల స్నానం చేయాలి. ఇది జుట్టు చివర్లను డామేజ్ నుండి కాపాడి ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది.

Advertisement

ఆవకాడో కూడా జుట్టు చివర్లు ను సరిచేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఆవకాడో మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి ఆవకాడో జుట్టుకు కావలసిన తేమను అందిస్తుంది. అలాగే మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఇప్పుడు చెప్పుకున్న చిట్కాలు అన్ని డ్యామేజ్ అయినా జుట్టు చివర్లను సరి చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.

Advertisement