Hair Tips : జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరగాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి. జుట్టు బాగా ఉంటే మన అందం కూడా రెట్టింపు అవుతుంది. కానీ దానికోసం ఎన్నో రసాయన ఉత్పత్తులు వాడడం వల్ల వున్న జుట్టు కూడా రాలిపోతుంటుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో జుట్టును పొడుగ్గా,బలంగా మరియు మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేవి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరం ఆరోగ్యానికే కాక జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. జుట్టు కు గుడ్డు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని కోసం ఒక బౌల్ లో రెండు గుడ్లను పగల కొట్టి..అందులో కొబ్బరి నూనె యాడ్ చేసి కుదుళ్ల కు మర్దన చేసి, అరగంట సేపు అరిన తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు ఆరోగ్యాంగా పెరుగుతుంది.
ఆరెంజ్ జ్యుస్ త్రాగడానికే కాక జుట్టుకు అప్లై చేసినా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాని కోసం ఆరెంజ్ జ్యుస్ లో, ఆపిల్ జ్యుస్ కలిపి జుట్టుకు పట్టిస్తే ఇందులో ఉండే సి విటమిన్ చుండ్రు నివారణకు దోహదం చేస్తుంది. అవిసెగింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని కోసం అవిసె గింజలు రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తలకు అప్లై చేసి గంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా, దృఢంగా పెరగడానికి దోహదం చేస్తుంది.
జామకాయ లో ఉండే సి విటమిన్ జుట్టు కు కలిగే ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. జామకాయ, మరియు కొబ్బరి పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, జుట్టు చివరల వరకు పట్టించి, అరగంట సేపు ఆరనిచ్చి, తలస్నానము చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఆరోగ్యాంగా, పొడుగ్గా పెరుగుతుంది. eఅవోకాడోలో విటమిన్లు A, B మరియు E అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును తేమగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.అలాగే అవకాడో మరియు అరటిపండును కలిపి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు కుదుళ్లకు అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షీకాయతో స్నానం చేస్తే,జుట్టు పొడుగ్గా, బలంగా పెరగడానికి దోహదం చేస్తుంది.