Hair Problems : సాధారణంగా వేసవికాలం రాబోతోంది కాబట్టి చాలా మందిలో జుట్టు సమస్యలు అధికంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తలపై ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే చుండ్రు వచ్చినప్పుడు దురద , చికాకు గా అనిపించడమే కాకుండా జుట్టు రాలే సమస్యలు కూడా అధికమవుతాయి. ఇకపోతే చుండ్రు .. ఎలాంటి కారణాలవల్ల అధికంగా వస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
1. చక్కెర కలిగిన పదార్థాలను ఎక్కువగా తినడం : మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు చక్కెర జుట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచినప్పుడు మాడుపై ఉండే గ్రంథులు ఎక్కువ నూనెలను స్రవిస్తాయి. అంతే కాదు బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి . వీటి వల్ల తలపై చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువ . కాబట్టి వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి.

2. పోషకాహారం సరిగ్గా తినకపోవడం : తలలో జుట్టు సమస్యలు రాకుండా ఉండాలి అంటే విటమిన్ బి , జింక్ వంటి పోషకాలు అవసరమవుతాయి. ఇక అరటిపండు , సీ ఫుడ్ , రెడ్ మీట్ , నట్స్, అవకాడో వంటివి తినడం వల్ల చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ జింక్ యొక్క సమ్మేళనాలు కాబట్టి చుండ్రు సమస్యలు దూరం అవుతాయి.
3. సరిగా తలస్నానం చేయకపోవడం : చాలామంది తలపై షాంపు వేసి వెంటనే తలస్నానం చేస్తూ ఉంటారు.. కానీ అలా చేయడం వల్ల జుట్టుపై పెరిగిపోయిన దుమ్ముధూళి వదిలి పోదు. కాబట్టి జుట్టుపై షాంపూ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు పూర్తిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి.
4. హీటింగ్ ఉత్పత్తులు ఉపయోగించడం : సాధారణంగా జుట్టు స్ట్రైట్ కోసం స్త్రైటనర్, జుట్టును ఆరపెట్టుకోవడానికి డ్రైయ్యర్ వంటివి ఎక్కవగా ఉపయోగించినా సరే జుట్టు సమస్యలు అధికమవుతాయి. సెబం ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన చుండ్రు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.