Hair Care : అప్పుడెప్పుడో పెళ్లి సందడి సినిమాలో మా పెరటి జాం చెట్టు పళ్ళని కుశలం అడిగే పాటలో అన్నట్టు.. అవి అడిగినా అడగకపోయినా జామాకులు మీ కేశాల యోగక్షేమాలు చూసుకుంటాయని మీకు తెలుసా.. మీ ఇంట్లో జామ !?చెట్టు ఉంటే మీ జుట్టు సమస్యల పరిష్కారానికి ఇంకెక్కడికి పరిగెత్తనవసరం లేదు.. జామ ఆకులు మీ జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.! అయితే ఎలా వాడితే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.!

జామ ఆకులలో యాంటీ మైక్రోబియాల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడతాయి. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి మీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో ఓ 20 జామ ఆకులను వేసి 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత జామ ఆకుల నీటిని వడకట్టాలి. ఈ జామకుల నీటిని ముందుగా తలస్నానం చేసిన తలపైన మాత్రమే రాసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరనివ్వాలి. ఆ తరువాత జుట్టు పాయలు పాయలుగా విడదీసి జామ ఆకుల నీటిని జుట్టు మొదల నుంచి చివరి వరకు రాయాలి
ఇలా ఈ నీటిని రాసుకున్న తర్వాత మాడులోకి ఆ నీరు ఇంకేటట్టు పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు గంటల పాటు ఉంచి ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసేయాలి. జామ ఆకుల నీరు మీ జుట్టుకి చక్కటి హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఈ నీటిని ఉపయోగించిన తర్వాత వేరే కండీషనర్ వాడాల్సిన అవసరం లేదు. జామకుల నీరు మీ జుట్టు పెరుగుదల మెరుగు అవ్వడమే కాకుండా ఒత్తుగా, మృదువైన, మెరిసే కురులు మీ సొంతమవుతాయి. జుట్టు చివర్ల చికిలిపోవడం వంటి వాటిని రిపేర్ చేసే జుట్టు ఒత్తుగా పెరిగేలాగా సహాయపడుతుంది. ఈ జామ ఆకుల నీటిని ప్రతిరోజు మీ జుట్టుపై స్ప్రేలా చల్లుకున్న కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కండిషనర్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జామ ఆకుల టీ ను తయారు చేసుకుని ప్రతిరోజు తాగితే లోపల నుంచి కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయ పడుతుంది.