Hair Tips : చలికాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.. అయితే కొత్త సంవత్సరం రోజున జుట్టు ఒత్తుగా సిల్కీ గా కనిపించాలంటే.. పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంచక్కా మీ ఇంట్లో ఉండే పెరుగుతో జుట్టుని మెరిపించవచ్చు. ఇప్పుడు చెప్పుకోపోయే హెయిర్ ప్యాక్ లో మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ ను వేసుకొని అందమైన కేశలతో ఆనందించండి..
అరకప్పు పెరుగులో 2 చెంచాల మెంతి పిండి కలిపి.. పేస్ట్‌లా తయారు చేసుకోండి. దీన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.. ఈ ప్యాక్ వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది, జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది, జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ అయ్యి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
ఒక కప్పు పెరుగులో ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ జుట్టు మొత్తం పట్టించి.. ఆరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ ఫ్యాక్‌తో చండ్రు సమస్య దూరం అయ్యి జుట్టు సిల్కీగా మారుతుంది. లేదంటే నేరుగా పెరుగును కూడా జుట్టు కుదుల నుంచి చివరి వరకు అప్లై చేసుకున్న జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది.