Hair Tips : హెయిర్ డస్టింగ్ తో జుట్టు పెరుగుతుందా..!? చాలా సింపులా.!?

Hair Tips : హెయిర్ డస్టింగ్ అంటే హెయిర్ కటింగ్ టెక్నిక్.. ఇది జుట్టు పొడవును తగ్గించకుండా స్ప్లిట్ ఎండ్ తొలగించే మంచి పద్ధతి.. జుట్టు చివర్లను కట్ చేసే మంచి టెక్నిక్. ఈ ప్రత్యేకమైన హెయిర్ మెయింటినెన్స్ టెక్నిక్ అన్ని రకాల హెయిర్ టైప్స్, టెక్చర్లకు అనుకూలంగా ఉంటుంది..‌

Hair dusting technique advantages for hair growth
Hair dusting technique advantages for hair growth

ఈ పద్ధతిలో జుట్టు చివర్లను కత్తిరిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కేశాలు చక్కగా కనిపిస్తాయి. హెయిర్ డస్టింగ్ అనేది జుట్టును సేవ్ చేసే పద్ధతి. ఇది స్ప్లిట్ ఎండ్ సమస్యను తగ్గిస్తుంది. హెయిర్ కలరింగ్, హీట్ ఇన్స్ట్రుమెంట్స్ మొదలైన వాటికి గురైనప్పుడు జుట్టు డ్రై గా మారిపోయి.. త్వరగా చిట్లి పోతుంది. ఈ పద్ధతిలో జుట్టు చివర్లను తొలగిస్తే జుట్టు యధావిధిగా పెరుగుతుంది. ఒకవేళ తొలగించకపోతే స్ప్లిట్ ఎండ్స్ జుట్టు అంతా వ్యాపించే అవకాశం ఉంది. హెయిర్ డస్టింగ్ లో జుట్టు పొడవును తగ్గించడం కాదు చిట్లిపోయిన చివర్లను మాత్రమే తొలగిస్తాం. హెయిర్ డస్టింగ్ ను ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి చేసుకోవాలని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు. హిట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించేవారు, పల్చని చుట్టూ ఉన్నవారు, చివర్లు చిట్లిపోయిన వారు హెయిర్ డస్టింగ్ తరచూ చేయించుకోవడం మంచిది.