Health Tips : ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా ప్రతి ఒక్కరు కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, అంటూ తెగ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. అంతే కాదు చిన్నపనికి ఆయాస పడిపోతూ ఇబ్బందులను తెచ్చుకుంటున్నారు. ఇక మరికొంతమంది దాదాపు ఏళ్ల తరబడి కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల తో ఇబ్బంది పడుతున్నామంటూ వైద్యుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాతది అయినప్పటికీ ఈ తరం వారికి మాత్రమే చిట్కా గురించి పెద్దగా తెలియదు అనే చెప్పాలి.
ఇక ఈ చిట్కాతో ఎవరైనా సరే కీళ్ల నొప్పులు , కాళ్ల నొప్పులు, చేతులు, మెడ , వెన్నెముక ఇలా ఎన్నో నొప్పి సమస్యలను దూరం చేసుకోవచ్చు.అయితే ఈ చిట్కా కోసం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేయాలి. ఇప్పుడు ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కిళ్ళీలకు ఉపయోగించే సున్నం వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కూడా జోడించవచ్చు.. ఇప్పుడు ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ ప్రాంతాలలో ఈ మిశ్రమాన్ని రాసి దానిపైన ఒక తమలపాకులో పెట్టి కొద్దిగా క్లాత్ తో కట్టుగా కట్టాలి.. ఇలా చేయడం వల్ల నొప్పి ఉన్న ప్రదేశంలో గట్టిగా తయారయ్యి నొప్పిని తగ్గించడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

సున్నం కట్టడం వల్ల క్యాల్షియం లోపాల్ని సవరిస్తుంది.. నొప్పి ఉన్న ప్రదేశంలో రాత్రిపూట ఈ కట్టుకట్టి మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఎలాంటి నొప్పులు అయినా సరే ఇట్టే తగ్గిపోతాయి.. ఇక ఈ చిట్కాను తరచూ ఉపయోగిస్తూ ఉండటం వల్ల శాశ్వతంగా ఇలాంటి నొప్పులను దూరం చేసుకోవచ్చు. అంతే కాదు ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక టేబుల్ స్పూన్ బెల్లంతురుము వేసుకొని తాగడం వల్ల కూడా ఎముకలు బలంగా పెరగడంతో పాటు కీళ్ళనొప్పులు కూడా దూరమవుతాయి.