ముఖం బాహ్యంగా అందంగా కనిపించాలి అంటే లోపల నుంచి పోషణ చాలా అవసరం. మీరు బాహ్య చర్మానికి రంగులు దిద్దే బదులు కొన్ని పండ్ల రసాల సహాయంతో సహజంగా మీ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే కొన్ని పండ్ల రసాలు మీరు తాగడమే కాదు.. ముఖం మీద అప్లై చేసుకున్న వారికి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇకపోతే ముఖ సంరక్షణ కోసం మొటిమలను , మచ్చలను దూరం చేయడానికి ఎలాంటి పండ్లరసాలను ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల మచ్చలకు ఆరెంజ్ జ్యూస్ : బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగించే విటమిన్ సి మనకు ఆరెంజ్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది. అందుకే నారింజ పండ్ల నుండి రసాన్ని తీసి ముఖానికి అప్లై చేయాలి. పదినిమిషాల తర్వాత చేతి మునివేళ్ళతో చాలా తేలికగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం పై ఉండే నల్లమచ్చలు దూరమవుతాయి. అయితే వారానికి రెండు నుంచి మూడుసార్లు పాటించడం తప్పనిసరి.
ట్యాన్ కు స్ట్రాబెర్రీ జ్యూస్ : ఎండాకాలం రాబోతోంది పైగా ట్యాన్ సమస్య కూడా ఎక్కువవుతుంది. అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేకుండా స్ట్రాబెరీ తో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. స్ట్రాబెరి నుంచి రసాన్ని తీసి ముఖంపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . కావాలంటే మీరు పెరుగు కూడా జోడించవచ్చు.
జిడ్డు చర్మానికి దానిమ్మ జ్యూస్ : దానిమ్మ పండులో విటమిన్ సి మాత్రమే కాదు ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇక దానిమ్మ గింజల నుంచి తీసిన రసాన్ని కి కొద్దిగా పుదీనా కలిపి ముఖంపై అప్లై చేయడం వల్ల జిడ్డు చర్మం తొలగిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.
మొటిమలకు క్యారెట్ జ్యూస్ : క్యారెట్ రసం ముఖానికి అప్లై చేయడం వల్ల అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. ఇక క్యారెట్ రసాన్ని తీసి ముఖం మీద అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.ఈ పండ్ల రసాలను మీరు ముఖానికి అప్లై చేయడమే కాదు తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి.