Mens Face Pack : అందంగా ఉండాలని కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తూ చర్మాన్ని మరింత రఫ్ గా మార్చుకుంటూ ఉంటారు. అయితే మగవారి అందం కూడా రెట్టింపు కావాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. నిజానికి అమ్మాయిల ముఖ చర్మం తో పోల్చుకుంటే అబ్బాయిల ముఖ చర్మం చాలా మందంగా , రఫ్ గా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని వంటింట్లో దొరికే చిట్కాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల సత్వర ఫలితాలు లభిస్తాయని సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. పెరుగు, బియ్యప్పిండి ఫేస్ ప్యాక్ : అబ్బాయిలు ఈ ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల చర్మం మీద ఏర్పడిన మృతకణాలు , నల్లటి మచ్చలు దూరమవుతాయి. ముఖ్యంగా ఎండకు తిరగడం వల్ల ఏర్పడే నల్ల మచ్చలను కూడా దూరం చేయడంలో మగవారు కు చాలా బాగా పనిచేస్తుంది.. ఇక ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి కి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముఖానికి ఆవిరి పట్టి ఆ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇక పది నిమిషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. ఈ చిట్కాతో ముఖం మీద ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది.
2. శనగపిండి ఫేస్ ప్యాక్ : చర్మం యొక్క రంగును మార్చడానికి శనగపిండి చాలా బాగా పనిచేస్తుంది. ఇక శెనగపిండి కేవలం ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా చక్కటి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి శనగపిండిలో కొద్దిగా పసుపు, తేనె, పెరుగు వేసి ముఖానికి పట్టించడం వల్ల చర్మం కాంతిని పుంజుకోవడంతో పాటు అందంగా ఆరోగ్యంగా తయారవుతుంది.