After 45 Years : సాధారణంగా అమ్మాయిలకు లేటుగా వివాహం జరగడం లేదా పెళ్లయిన తర్వాత చాలా సంవత్సరాలకు పిల్లలు జన్మించడం లేదా ఏదైనా సమస్యల వల్ల పిల్లలు లేటుగా జన్మిస్తే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళల ను వేధిస్తున్న సమస్యలలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి. దీనికి నివారణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి..కొద్దిగా లేటు చేసిన సరే మనిషి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.. కాబట్టి ముందుగానే గుర్తించి సరైన ట్రీట్ మెంట్ తో పాటు ఆహారం కూడా తీసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళలకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ పై అవేర్నెస్ ఉండాలి.
అంటే కళ్ళతో చూడడం..చేతులతో బ్రెస్ట్ ను ఇన్స్పెక్ట్ చేయడం ద్వారా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించవచ్చు.. ముఖ్యంగా బ్రెస్ట్ మీరు మునివేళ్ళతో ప్రెస్ చేసినప్పుడు ఏదైనా గడ్డ లాగా అనిపించడం లేదా బ్రెస్ట్ సైజు లో మార్పులు గమనించినట్లయితే ఎలాంటి మార్పులు లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ లేనట్టే కానీ.. ఏదైనా మార్పు గమనించినట్లయితే వెంటనే అప్రమత్తమై వెంటనే మీ డాక్టర్ తో మాట్లాడండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బ్రెస్ట్ అవేర్నెస్ కోసం సెల్ఫ్ ఎగ్జామ్ సమయంలో గుర్తించినా చాలా మార్పులకు కారణాలు ఉన్నప్పటికీ కొన్ని మార్పులు మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ ను సూచిస్తాయి.
ఇక చాలా మంది స్త్రీలు తమ బ్రెస్ట్ లో గడ్డలు , సైజ్ లో మార్పును గమనిస్తారు కాబట్టి గడ్డ ఉన్న ప్రతి చోట క్యాన్సర్ వస్తుందని కాదు.. ఒకవేళ మీకు ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.. ఎందుకంటే కొన్నిసార్లు పీరియడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి అసాధారణ మార్పులు రావడం సహజం. ఇకపోతే తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో 20 సంవత్సరాల వయస్సు తరువాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ ను అలాగే 45 సంవత్సరాల వయసుపైబడిన వారికి యనువల్ మామోగ్రామ్ టెస్టును రిఫర్ చేస్తున్నారు.. ఇకపోతే 45 సంవత్సరాలు పైబడిన వారు పిల్లలను కనడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందట..