Jaggery Problems : అదేంటి బెల్లం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని.. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా.. ఇప్పుడు ఏంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక మానరు.. ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండే తీపి ఆహారపదార్థాలలో బెల్లం కూడా ఒకటి. ముఖ్యంగా పండుగ వంటి సందర్భాలలో బెల్లం వేసి చేయని తీపి పదార్థాలు అంటే ఏవీ వుండవేమో.. ముఖ్యంగా భారతీయ వంటకాలలో బెల్లానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వుంది.. మరీ ముఖ్యంగా చక్కెర కంటే బెల్లం తోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు కూడా తెలిపిన విషయమే. ఇక అందుకే డయాబెటిస్ పేషంట్స్ కూడా బెల్లంను కొద్దిగా మోతాదులో తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.
అయితే అతిగా ఉపయోగిస్తే మాత్రం సమస్యలు తప్పవట. ఎందుకంటే బెల్లంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తో పాటు కొవ్వులు , ప్రొటీన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. మితంగా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.. ఏదైనా సరే అమితంగా అయితేనే సమస్య. పరిమితిని మించి బెల్లం తినడం వల్ల బరువు కూడా పెరుగుతారట. ఇక డయాబెటిస్ పేషెంట్లు కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి మధుమేహ వ్యాధి గ్రస్తులకు మరింత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. బెల్లం ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం సమస్యలు కూడా అధికంగా వస్తాయి.

ఇకపోతే సాధారణంగా బెల్లంలో మనకు లభించే ఐరన్ వల్ల రక్తం వృద్ధి చెందుతుంది అని వైద్యులు సిఫార్సు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అంతే కాదు జుట్టు పెరుగుదలకు కూడా జుట్టు రాలిపోవడాన్ని ఆపడానికి కూడా బెల్లం ఉపయోగిస్తారు. ఇక ఏదైనా సరే మితంగా తీసుకున్నప్పుడే ఏ ఆహార పదార్థాల నుంచి అయినా మనకు పోషక విలువలు అందుతాయి.. కానీ అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని .. కాబట్టి కొద్ది మోతాదులో మాత్రమే డైలీ డైట్ లో చేర్చుకోవాలి అని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.