Health Tips నాన్ వెజ్ ప్రియులలో చాలామందికి ఇష్టమైన మాంసాహారాలలో సీ ఫుడ్ కూడా ఒకటి.. సి ఫుడ్ అనగానే మనకు వెంటనే చేపలు గుర్తొస్తాయి. రొయ్యలు, పీతలు ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఇష్టమైనవి చేపలు మాత్రమే అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉంటాయి. చేపలను తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. ముందుగా చేపలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.
చేపలలో క్యాల్షియం, ఫాస్పరస్ ,ఐరన్ , మెగ్నీషియంతో పాటు విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు చేపలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు పుష్టిగా తయారవుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో చేపలు చాలా చక్కగా పనిచేస్తాయి. కొంతమందికి పడుకున్నా కూడా నిద్ర పట్టదు. అలాంటి వారు వారంలో రెండు సార్లు చేపలు తింటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే డిప్రెషన్ తో బాధపడే వారికి కూడా ఇవి చాలా సమర్థవంతంగా సహాయపడతాయి.
ఇకపోతే చేపలలో మనకు చాలా రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా కొన్ని రకాల చేపలు మాత్రమే మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి . వాటిలో ఏరి కోరి మరీ చేపలను ఎంచుకోవడం వల్ల ను ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇకపోతే చేపలను తినేటప్పుడు అందులో ఉండే ముళ్లను తీసివేయాలి. లేకపోతే గొంతులో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చికెన్ మటన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ తో పోల్చుకుంటే చేపలు మీ ఆరోగ్యాన్ని మరింత పదిలం చేస్తాయని చెప్పవచ్చు.