Health Benifits : ఈ మొక్క కనిపిస్తే అసలు వదలొద్దు ఎందుకంటే.!

Health Benifits: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయి.. మనకు తెలిస్తే వాటిని ఔషధ మొక్కలుగా భావించి ఉపయోగిస్తాము. మనకు ఆ మొక్క గురించి తెలియకపోతే వాటిని పిచ్చి మొక్కగా భావించి పక్కన పడేస్తాము. నిత్యం మన చుట్టూ కనిపించే తీగ జాతి మొక్కలలో దూసర తీగ కూడా ఒకటి. ఈ తీగ మొక్కను ఏ విధంగా ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

దూసర తీగను చాలా పాతాళ గరుడి తీగ, సిప్పి తీగ, చీపురు తీగ, గరుడ తీగ అనే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ తీగ ఆకులలో యాంటీ మైక్రోబియల్ , యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంది. ఇది అనేక రకాల వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలోకి వైరస్ , ఇన్ఫెక్షన్ కారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.

దూసర తీగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక గ్లాసులో పోసి ఉంచి ఒక ఐదు గంటల పాటు ఆ గ్లాస్ ని కదిలించకుండా పక్కనపెట్టి ఉంచాలి. ఆ తరువాత ఆ రసం అంతా జెల్ లాగా తయారవుతుంది.. ఈ జెల్ లో కొద్దిగా పట్టిక బెల్లం కలిపి తీసుకోవాలి.  దీనిని తీసుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. శరీరానికి చలవ చేస్తుంది. ఈ జెల్ ను వారానికి రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే శరీర అధిక వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

దూసర తీగ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయం తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.  షుగర్ ఉన్నవారికి ఈ ఆకుల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. గజ్జి తామర దురద ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని రాస్తే ఫలితం కనిపిస్తుంది. స్త్రీ,  పురుషులలో హార్మోన్ల సమస్యలు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే తగ్గుతాయి.  సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది.