Health Tips ప్రతి మనిషి మంచి కండ బలంగా ఉండాలని కోరుకుంటారు. మరి ఇలా రావాలంటే ఏం తినాలి.అని అందరూ అనుకుంటారు. అయితే డాక్టర్ని అడిగిన పెద్దల్ని అడిగినా కూడా గుడ్డు తినండి లేదా మాంసం తినండి పాలు త్రాగండి అని ఈ మూడింటి పేరే చెబుతారు. మొదటగా చాలా ముఖ్యమైంది గుడ్డు. ఈ నేచర్ లో గుడ్డుకు మించిన బలమైన ఆహారం మరొకటి లేదు. దీని గురించి విపరీతంగా వింటుంటాం. అయితే గుడ్డు తినగా దానివలన బలం ఎంటో వాస్తవమేంటో చూద్దాం..

అయితే కోడి గుడ్డు తినడం వల్ల అందరికీ బలం వస్తుంది. అయితే మనం గుడ్డు తింటున్న ఆ కోడి ఏం తింటుంది. మరి దాని బలానికి అది గింజలు తింటుంది. కానీ మనం మాంసాహారం తింటున్న జంతువుని తినడం లేదు. శాఖాహారం తింటున్న జంతువుని మీరు తింటున్నారు. అది శాకాహారం తిని మంచి ఆరోగ్యంగా ఇంత హెల్తీగా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇది గొప్పది. అని అనుకుంటున్నాం. అందుకనే కోడి గుడ్డు పెట్టే కోడి తిన్న ఆహారం గింజలు. గింజలు బలమా గుడ్డు బలమా అంటే అందరూ గుడ్డే బలమని చెబుతారు. గుప్పెడంత గుడ్డులో ఎంత పోషకాలు ఎంత బలం దాగి ఉందో తెలుసుకుందామా..
అయితే ఒక కోడిగుడ్డు 50 లేదా 60 గ్రాముల బరువు ఉంటుంది. ఆ కోడిగుడ్డులో 72 క్యాలరీల శక్తి ఉంటుంది. ఈ బలము కూడా 15 కేలరీల ఎనర్జీ తెల్లసనలో ఉంటాయి. మిగతా భాగం మాత్రం పచ్చ జన ఉంటుంది.
ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ చాలామంది ఎగ్ లో జనని తీసి తింటారు. అది తీయడం వల్ల అందులో ఉన్న మూడు గ్రాముల ప్రోటీన్ బయటకు పోతుంది. అయితే బాడీ కి ఒక కేజీ బరువుకి ఒక గ్రామ ప్రోటీన్ కావాలి.అదేవిదంగా బిడ్డలకి ఒక కేజీ బరువుకి రెండు గ్రాముల ప్రోటీన్ అవసరం. అయితే ఒకటి గుడ్డు లేదా తెల్ల జన పచ్చజొన తినడం తప్పు. రెండు ఎగ్గులు తిన్నా కూడా మీకు వచ్చేది 14 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే..