TEA : టీ తో వీటిని కలిపి తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!!

TEA : సాధారణంగా చాలా మంది టీ తాగనిదే పూట కూడా గడవదని చెప్పవచ్చు. మరికొంత మంది రోజుకు నాలుగు సార్లు ఈ టీ తాగితే ఇంకొంతమంది గంటకొకసారి టీ తాగుతూ ఉంటారు. టీ తాగడమే ప్రమాదం అని చెబితే ఇలా గంటల కొద్దీ ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పవచ్చు. ఇకపోతే దీంతోపాటు కొంతమందికి బిస్కెట్ కూడా తినడం అలవాటుగా ఉంటుంది.. అయితే ఇది కొంతమందికి అలవాటైనా అయి ఉండవచ్చు లేదా నలుగురిలో కలిసినప్పుడు టీ తో పాటు బిస్కెట్లు తినాలి కదా అనే ఒక ఆలోచన అయినా ఉండవచ్చు.. ఏది ఏమైనా నష్టం మాత్రం మనకే అని గుర్తుంచుకోవాలి.

టీ లో బిస్కెట్ తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు వైద్యనిపుణులు. బిస్కెట్లు తయారు చేసే పిండిని పూర్తిస్థాయిలో శుద్ధిచేసి బిస్కెట్ తయారు చేయడం వల్ల అందులో సుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా పళ్ళ మీద ఉండే ఎనామిల్ దెబ్బతిని పంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు దంతాల కేవిటీ కూడా క్షీణిస్తుంది.. పిండిని రిఫైన్డ్ చేయడం వల్ల ఫైబర్ కంటెంట్ తొలగిపోయి మలబద్దకం సమస్య ఏర్పడుతుంది..బిస్కెట్ లేదా కుకీస్ తయారు చేసేటప్పుడు బి హెచ్ టీ అనే పేరు ఉన్న రెండు ప్రిజర్వేటివ్ లను కలుపుతారు..

eat these with tea  Beware Tasmat 
eat these with tea  Beware Tasmat

ఫలితంగా ఆరోగ్యానికి నష్టం చేకూరడమే కాకుండా బిస్కెట్ లో ఉండే చక్కెర స్థాయి వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయి , డయాబెటిస్ వచ్చే సమస్య కూడా ఉంటుంది.. అంతేకాదు ఎక్కువ కాలం టీ తో కలిపి బిస్కెట్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి కూడా పెరిగిపోతుంది . ఇక సోడియం స్థాయి పెరగడం వల్ల డయాబెటిస్, థైరాయిడ్ రోగులు మరింత సమస్యలకు గురి అవుతారు ..అంతేకాదు బిస్కెట్లు ఎక్కువగా టీ తో కలిపి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.