Hair Tips : చుండ్రు కారణంగా జుట్టు సమస్యలు అధికంగా వేధిస్తాయి. పైగా జుట్టు రాలిపోవడం, ఊడిపోవడం వంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి.. కాఫీ పొడితో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. చుండ్రు నుంచి జుట్టు పెరిగే వరకు కూడా కాఫీ పొడితో అనేక రకాల హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు.. అవేంటో చూద్దాం..

గోరువెచ్చటి కొబ్బరి నూనెలో ఒక చెంచా కాఫీ పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కాఫీలో కెఫెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. చుండ్రు ను నివారిస్తుంది. కాఫీ పొడి, తేనె, ఆలివ్ ఆయిల్ మూడింటిని సమపాలల్లో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుంచి చివరి వరకు పట్టించాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టును ఒత్తుగా పెరగడంతో పాటు జుట్టుకు కొత్త మెరుపును సంతరించుకునేలాగా చేస్తుంది..
ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో ఒక చెంచా కాఫీ పొడి కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. కాఫీ పొడి చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు చివర్లు చిట్టి పోవడం వంటి సమస్యలను నయం చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుంది. కోడిగుడ్డు తెల్ల సోనా తీసుకొని అందులో కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ తో జుట్టుకి కావలసిన ప్రోటీన్ అందడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరిగేలాగా నిగనిగలాడే లాగా చేస్తుంది.