Health Tips : భాగ్యనగరంలో బంగారు తోట….!! ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మొక్క ఏంటో తెలుసుకుందాం..

Health Tips : అనేక అనారోగ్య సమస్యలకు ఇది మంచి దివ్య ఔషధం . అంతేకాకుండా ముఖ్యంగా ఇది సంతానం కలగని వారికి మంచి దివ్య ఔషధం. దాని పేరు దూసర తీగ. దుస్సారథిగా, పాతాళగరుడా, ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రజలు దీనిని వాడతారు. ఇప్పటికి కూడా పల్లెటూర్లలో దీని ఆహారంగా వాడుతున్నారు. వీటి తీగలు చాలా హార్డ్ గా ఉంటాయి. మైగ్రేన్ కి చాలా బెస్ట్ మెడిసిన్ గా వాడతారు. అంతేకాకుండా మూత్రణాల ఇన్ఫెక్షన్ కి దీని రసం బాగా ఉపయోగపడుతుంది.సమ్మర్లో ముక్కులో నుంచి రక్తం వచ్చే వారికి ఈ రసాన్ని తాగితే తగ్గిపోతుంది.బాడీలో హీట్ తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

Dusara teega excellent health benefits
Dusara teega excellent health benefits

పిసిఒడి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మరియు సంతాన ప్రాబ్లం ఉన్నవారికి మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. గర్భాశయానికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని సెట్ చేయడానికి దీనిని ఆహారంగా తీసుకోవడం మంచిది. అండం విడుదల కాకపోవడం వీటన్నింటికీ కూడా బాగా పనిచేస్తుంది. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చిన్న పెద్ద ఆడ మగ ఎటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా సంతాన ప్రాప్తికి 90% పనిచేసే మందు. దీనిని జ్యూస్ టైప్ లో కానీ లేదా మజ్జిగలో వేసుకొని కానీ తాగవచ్చు.

ఈ తీగ పాలకూర టేస్ట్ ను కలిగిస్తుంది. డైరెక్ట్ గా అయిన తీసుకోవచ్చు లేదా అలా తినలేని వారు పట్టిక బెల్లం సాయంతో తినవచ్చు. వానాకాలంలో లేత ఆకులు వస్తాయి. వాటిని వాడడం కూడా మంచిది. మరియు జ్యూస్ గా కూడా వాడుకోవచ్చు. దూసర తీగనే కాకుండా శతావరి దుంపలు, ప్రస్తుతం కరోనాకి మందుగా వాడుతున్న బుడ్డగుడుస ఆ పండు కాయలు తినడం వల్ల కూడా పిసిఒడి తగ్గుతుంది. అలాగే కాసాకు కూడా బాడీలో ఏ రకమైన వ్యాధినైనా తొలగించే శక్తి దీనికి ఉంది.