motivational quotes of swami vivekananda స్వామి వివేకానంద ఎన్నో మంచి విషయాలను నేటితరం వారికి పనికి వచ్చే విధంగా చెప్పారు. ఆయన సూక్తులలోని జ్ఞాన సంపద ఇప్పటికి ఆచరణనీయం.. ఎన్నో గొప్ప సూక్తులను చెప్పారు. అందులో తెలివైన పురుషుడు ఒక స్త్రీకి చెప్పకూడని రెండు విషయాల గురించి కూడా ప్రస్తావించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది.. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు.. చూసి చెప్పేస్తారు..
నవ్వితే చూడవలసింది దంతాలను కాదు దరహాసాన్ని.. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు కారణాలను..
గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితో.. ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోను పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది..
ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో.. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. మనకి నిన్న అనేది తీరిపోయిన రుణం.. రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం..
ఎవరినో నమ్ముకుని ఏదో చేసేద్దాం.. ఏదో అయిపోదాం అనుకోకు ..ఇది సినిమా కాదు జీవితం.. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు..
కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కావు.. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను.. చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి.
జీవితాన్ని అర్థం చేసుకునేవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు . ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే పోతాం.ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి ఈ రెండు విషయాలు చెప్పడు అతని నిజమైన భావాలు.. అతని సమతుల్యత..