మీ కురులు కారుమేఘాల్లాగా పెరగాలంటే ఈ రెమిడీ ఒక్కసారి ట్రై చేసి చూడండి?

నేటి దైనందిత జీవితంలో ఆడవాళ్లు, మగవాళ్ళు అనే తేడాలేకుండా అందరూ ఎదుర్కొన్న సమస్య ఒకటుంది, అదే జుట్టు రాలడం. అవును నేడు దాదాపుగా 70 శాతం మంది జుట్టు రాలడం, జుట్టు పేలిపోవడం, జుట్టు పండిపోవడం, చుండ్రు వంటి సమస్యలతో సతమతమౌతున్నారు. అయితే ఆ సమస్యలకు మార్కెట్లో దొరికిన ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోగా అనేకరకాల స్కిన్ సంబంధిత వ్యాధులు రావడం కొసమెరుపు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది మన పురాతనకాలం నటి పద్ధతే. ఈ హైటెక్ యుగంలో మనం పాత పద్ధతులను మరిచిపోయాం కాబట్టే ఇన్ని సమస్యలు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మిశ్రమం కేవలం 2 పదార్ధాలతో తయారు చేయబడినది. ఒకటి కలబంద అయితే రెండవది కొబ్బరి నూనె. ఈ రెండు పదార్ధాలు మనకి అనేకరాలుగా మేలు చేస్తాయని మీలో ఎంతమందికి తెలుసు?

కలబంద:
కలబందకి కేవలం కురులను దృఢపరిచే సామర్ధ్యమే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే గుణం కూడా కలదు. అందుకే అనేక కంపెనీలు తమ బ్యూటీ ఉత్పత్తులలో కలబందని విరివిగా వినియోగిస్తారు. కలబంద విటమిన్లు, న్యూట్రియేంట్స్, ఎంజైమ్, కార్బొహైడ్రేట్లు, సపోనిన్లు, లిగ్నిన్, సాలిసిలిక్ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ వంటి 75 క్రియాశీల పదార్తాలను కలిగి ఉంటుంది. దీనిని ఒకసారి మాడుకి రాసుకుంటే దీని లైట్, నాన్ గ్రీజీ టెక్చర్ శిరోజాల మొదళ్ళనుండి చర్మ కణాల లోనికి డీప్ గా చొచ్చుకుపోయి హెయిర్ ని రిపేరు చేస్తుంది. దీంతో మీ కురులు నిగనిగలాడుతూ మెరవడమేకాకుండా చాలా ధృడంగా ఉండగలవు.

Alovera oil for silky Hair and growth
Alovera oil for silky Hair and growth

కొబ్బరినూనె:
కొబ్బరి నూనెను ఆయుర్వేదంలో అమృతం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని ఉపయోగం అంతాఇంతా కాదు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఒంటిలో తేమ ఆరిపోకుండా కాపాడుతుంది. ఫలితంగా కుదుళ్ళు చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి. అంతేకాకుండా పచ్చి కొబ్బరి నూనెను ఒంటికి రాసుకుంటే, ఇది హానికరమైన UV రేడియేషన్‌ నుండి రక్షిణనిస్తుంది. కొబ్బరి నూనె, కలబందల మిశ్రమాన్ని కలిపి మీ జుట్టుకి పట్టించినపుడు అద్భుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు.

తయారీ విధానం:
తయారీ విధానం చాలా సులువు. రెండు కలబంద రెక్కలను తీసుకొని మొదట బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటి గుజ్జుని చాలా జాగ్రత్తగా టేబుల్ స్పూన్ సహాయంతో తీసుకొని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఆ తరువాత దానిలో రెండు మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరినూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన మిశ్రమాన్ని మీ కురులకు మొదళ్ళనుండి చివరి వరకు బాగా పట్టించి కొన్ని గంటలు ఆరబెట్టాలి. ఆ తరువాత హెడ్ బాత్ చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.