Proteins Foods : శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో ప్రోటీన్స్ కూడా అంతే అవసరం అవుతాయి. అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27 వ తేదీని జాతీయ ప్రోటీన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక పోతే ప్రొటీన్స్ వల్ల మనకు ఉపయోగం ఏమిటి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా భారతదేశంలో ప్రోటీన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ప్రోటీన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మనదేశంలో. ఇక రోజువారీగా తగినంత ప్రోటీన్ తీసుకోవడానికి మనం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.. అతిగా తినడం నుండి మొదలుపెట్టి తినడం తప్పించుకునే వారి వరకు ఈ ప్రోటీన్స్ ని చాలా బాగా ఉపయోగపడతాయి . అంతేకాదు శరీరంలోని కణాలను సరి చేయడానికి కొత్త కణాలను తయారు చేయడానికి కూడా మీ శరీరానికి ప్రోటీన్ అనేది చాలా సహాయపడుతుంది. గొప్ప పోషక విలువలు కలిగిన ఈ ప్రోటీన్ మనకు ఎలా లభిస్తుంది.. దేని ద్వారా లభిస్తుంది అనే విషయం గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

కోడిగుడ్లు : కోడిగుడ్లు అనేవి మొత్తం ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం అని చెబుతారు . గుడ్లు అందరికీ కూడా ఇష్టమైన ఆహారం ఇందులో ప్రోటీన్ తో పాటు సెలీనియం.. విటమిన్ బి 12.. విటమిన్ ఎ కూడా పుష్కలంగా లభిస్తుంది.
సాల్మన్ చేపలు : ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి అని అందరికీ తెలిసిందే.. ఇందులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా నిండి ఉంటుంది . 100 గ్రాముల చేపలు తీసుకోవడం వల్ల మనకు 20 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
కాటేజ్ చీజ్ : శాఖాహారులు అందరికీ ఇది ఒక ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు . ఇందులో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్ పుష్కలంగా నిండి ఉంటుంది. ఇక మనకు క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ తో పాటు ఇతర పోషకాలు కూడా కాటేజ్ చీజ్ ద్వారా లభిస్తాయి.