Pregnant Women : గర్భిణీ స్త్రీలు అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

Pregnant Women : గర్భం దాల్చడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు.. పెళ్లయిన తర్వాత దంపతులు తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.. ఈ నేపథ్యంలో ని దేవుడు కరుణిస్తే.. అనుకున్నట్టుగానే గర్భం దాలిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఇక గర్భం నిలిచింది అని తెలిసిన మొదటి రోజు నుంచి తొమ్మిది నెలల పూర్తి అయి.. చిన్నారి బయటకు వచ్చే వరకు గర్భిణీ చాలా జాగ్రత్తగా.. తీసుకునే ఆహారం నుంచి వేసుకొనే బట్టల వరకు ఇలా ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా ఆ నాటి కాలంలో అయితే గర్భం దాల్చిన తర్వాత కూడా మహిళలు ఎన్నో పనులు చేస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.కాలం మారుతున్న కొద్దీ జీవనశైలిలో మార్పులు రావడం.

. తీసుకునే ఆహారంలో పోషకాల లోపం ఇలా పలు కారణాల వల్ల గర్భం దాల్చిన తర్వాత స్త్రీ అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. గర్భిణీ స్త్రీ.. గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకున్నాం..చాలా మంది గర్భిణీ స్త్రీలు తెలిసో.. తెలియకో కొద్దిగా బరువు పనులు చేస్తూ ఉంటారు.. ఏదైనా కొద్దిగా బరువు ఉన్న వస్తువులు.. బక్కెట్లు.. నీటి బిందెలు వంటివి మోసుకెళ్తూ ఉంటారు.. ఇలా చేయడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కండరాలు బలహీనంగా మారి.. పొట్ట కిందకు సాగిపోయే అవకాశం ఉంటుందట. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు అని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Do you know what pregnant women should not do at all
Do you know what pregnant women should not do at all

మరి కొంత మంది గర్భం దాల్చిన తర్వాత బట్టలు ఉతకడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే బేబీ బంప్ తో వంగి లేవడం వల్ల ఆ స్త్రీ తో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది.చాలామంది గర్భం దాల్చిన తర్వాత ఇల్లు కడగడం, బాత్రూంలు శుభ్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసేటప్పుడు వీటిలో ఉపయోగించే వాషింగ్ జెల్ వల్ల అందులో ఉండే రసాయనాలు కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి. అంతేకాదు ఈ లిక్విడ్ వాసన పీల్చినా చాలు ఆ రసాయనాలు బిడ్డకు హాని కలుగజేస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించడం జరిగింది.