Keto Diet : ప్రస్తుత జీవన విధానంలో పాచాత్య పోకడలు ప్రవేశించాక ఆహారపు అలవాట్లు, పని వేళలు అన్ని విషయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మనమే కొని తెచ్చుకుంటున్నాము. అందులో భాగంగానే యూత్ ఎక్కువగా హీరోయిన్ లా సన్నగా ఉండాలని, ఎలాంటి వైద్యనిపుణుల సూచనలు తీసుకోకుండా, సోషల్ మీడియా లో వచ్చే అన్ని కరెక్ట్ గా వుంటాయని గుడ్డిగా అవగాహనా లోపంతో ఫాలో అవుతుంటారు.అలాంటి వారు డైట్ ఫాలో అవడం ద్వారా బరువు తగ్గొచ్చు అనే అపోహ తో అందరు క్విటో డైట్ పాలో అవుతుంటారు. అంతే కాక డయాబెటిస్, ఇతర సమస్యలకు ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నారా.. అయితే కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే.ఈ డైట్ వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.ఈ విషయాన్ని ఆరోగ్యనిపుణులు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు.
అవగాహనా లోపంతో ప్రస్తుతం ఈ డైట్ ని మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా అనుసరిస్తున్నారు.ఈ డైట్ ఎలా అనుసరిస్తారో తెలుసా..! కీటో డైట్ అంటే ..కార్బొహైడ్రెట్లు తక్కువగా తిని,కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం.కానీ ఇలాంటి డైట్ అనుసరించడం వల్ల క్రమంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు జాగ్రత్తలు చెబుతుంటారు. సన్నగా జీరో సైజ్ అవడానికి ప్రస్తుతం చాలామంది హీరో, హీరోయిన్ లు కూడా ఈ డైట్ ను ఎక్కువగా అనుసరిస్తుంటారు. మన శరీరానికి కొవ్వూలైన, కార్బోహైడ్రెట్స్ అయినా సమతులమైన ఆహారం తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవని ఆరోగ్యానిపుణులు హెచ్చరిస్తున్నారు.
కీటో డైట్ లో కార్బొహైడ్రెట్లను బాగా తగ్గించి ఆహారం తీసుకుంటే అందులో వున్న పీచు సరిగా అందక జీర్ణ సమస్యలు ఏర్పడి, క్రమంగా ఇది కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. క్రొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తానాలలో కొవ్వు అడ్డుగా పేరుకొని గుండెకు రక్తం సరఫరా అవదు. దీని కారణంగా గుండె రక్తాన్ని సరిగా శుభ్రపరచలేదు.గుండె కొట్టుకునే రేటు సాధారణంగా కొట్టుకొనేదానికన్నా తక్కువగా కొట్టుకుంటుంది. దీంతో గుండె పోటు వచ్చేలా మనమే మన చేతులారా చేసుకుంటాము.అంతేకాక కీటో డైట్ ను తీసుకున్న వారికి ఎక్కువగా రక్తహీనత కూడా వస్తుంది.ఈ డైట్ పాలో అవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా వుంది. కార్బొహైడ్రెట్స్ ఎక్కువగా తీసుకోకపోవడం మూలన ఎనర్జీ లభించక నీరసంగా కూడా తయారవుతారు.కాబట్టి ఆరోగ్య నిపుణుల ఆధ్వర్యంలో డైట్ చేస్తేనే ఆరోగ్యాంగా వుంటారు.