Health Problems : ఇంటి నుంచి బయటికి రావాలంటే ఎండలు విపరీతంగా వస్తున్నాయి.. భానుడి తాపాన్ని తట్టుకోడానికి జనం చల్లని నీటిని, జ్యూస్, పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉన్నారు.. అయితే ఈ ఎండలో ఎంతవరకు మేలు చేస్తాయో తెలియదు కానీ.. వేసవికాలంలో దొరికే తాటి ముంజలు ఆరోగ్యంతో పాటు, చల్లదనాన్ని కూడా ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవి కాలంలో లభించే తాటి ముంజలకు. పుచ్చకాయల కు మంచి గిరాకీ ఉంటుంది.తాటి ముంజలలో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి.. సహజసిద్ధమైన తాటి ముంజలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ తాటి ముంజలు తింటే ఆ ఎండ తాకిడిని మనం తట్టుకోవచ్చు. వేసవికాలంలో తాటి ముంజలు తినడం వల్ల శరీరంలో ఉష్ణాన్ని అదుపులో పెట్టవచ్చు. ఎండాకాలం చాలామంది వడదెబ్బతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా తాటి ముంజలు తినడం వల్ల ఎండాకాలంలో మంచి ఉపశమనం కలుగుతుంది.. పట్టుకుంటే జారిపోయేలా ఐస్ ముక్కల్లా ఉండే వీటిని అందరూ ఐస్ ఆపిల్స్ అని అంటూ ఉంటారు.క్యాలరీలు, విటమిన్లు , పోషకాలు వంటివి సమృద్ధిగా లభించడం వల్ల శరీరానికి మంచి పోషకాహారం అని చెప్పవచ్చు. తాటి ముంజలు తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి.

తాటి ముంజలు తినడం వల్ల మొత్తం నీటితో నిండి ఉంటాయి కాబట్టి శరీరానికి కావాల్సిన నీరు కూడా ఈ ముంజల ద్వారా మనకు లభిస్తాయి. ఇకపోతే కొంతమందికి ముఖం మీద వేడి తాపాన్ని తట్టుకోలేక మొటిమలు వస్తూ ఉంటాయి. ఇక అలాంటి వారు తరచూ తాటి ముంజలు తినడం వల్ల మొటిమలు సైతం దూరం అవుతాయి.వీటిలో ఉండే విటమిన్ బి, ఐరన్ , క్యాల్షియం వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఏమి తిన్నా సరే వారికి జీర్ణం అయిన భావన కలగదు.. కాబట్టి అలాంటి వారు ఈ తాటి ముంజలు తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు పెరుగుతుంది.