Health Problems : ఈ రోజుల్లో మాంసాహారాన్ని తింటే.. ఏమౌతుందో తెలుసా..?

Health Problems : ప్రతి ఒక్కరికి మాంసాహారము అంటే చాలా ఇష్టం ఉంటది.. అయితే అలాంటి మాంసాన్ని ప్రతిరోజు తినకూడదట.. కేవలం కొన్ని రోజులు మాత్రమే వాటిని పూజించాలట.. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మాంసాహారాన్ని తినకూడదని కొంతమంది పండితులు తెలియజేయడం జరుగుతోంది. మన పూర్వీకులు తీసుకువచ్చిన అద్భుతమైన సాంప్రదాయం ఏమిటి.. ఒకవేళ ఆ రోజుల్లో మాంసాహారాన్ని తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం .మన భారతదేశంలో ఎక్కువగా సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ ఉంటారు. మన పూర్వీకుల నుంచి వారంలో రెండు రోజులు మాంసాన్ని తినకూడదు అనే సాంప్రదాయం వస్తూనే ఉంది..

అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నవి. వారంలో ప్రతి రోజు మాంసాహారం తింటే ఈ భూమి మీద జీవరాశి మనుగడ ఉండకుండా పోతుంది.. అందుచేతనే వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను , పక్షులను చంపడం హిందువులు పాపంగా భావిస్తారు.. ఆ రోజుల్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని తింటే. ఏదైనా అపశకునం జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతూ ఉంటారు.. ఇక శరీరానికి అవసరమైన విటమిన్ పోషకాలన్నీ ఎక్కువగా మాంసంలో దొరుకుతుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు మాత్రమే మాంసాన్ని తినాలని మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని కనిపెట్టారు.కానీ ఇప్పుడు రాను రాను ప్రతిరోజు మనిషి మాంసం తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అలా ప్రతిరోజూ మాంసాహారాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదట. అందుచేతనే కొన్ని సంప్రదాయాలను కనిపెట్టడం జరిగిందట.

Do you know what happens if you eat meat these days
Do you know what happens if you eat meat these days

1). ముఖ్యంగా దేవుడిని నిత్యం పూజించే వారు మాంసాన్ని అసలు తినకూడదట. సోమవారం రోజున శివుడిని పూజించే వారు మాంసాన్ని తినకూడదట. తింటే పాపం వస్తుందని భక్తుల నమ్మకం.

2). మంగళవారం రోజున హనుమంతుడుని కొలిచేవారు తినకూడదు అని సూచించారు.

3). గురువారం రోజున సాయిబాబా, దత్తాత్రేయ స్వామి కి సంబంధించిన ఈ రోజు కావున ఆ రోజు ఈ దేవుళ్లను పూజించే భక్తులు తినకూడదట.

4). ఇక శనివారం రోజున ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన రోజు కావున.. ఈ రోజున మాంసాన్ని ముట్ట కూడదు అని మన పెద్దలు సూచించారు.

అయినా కూడా ఇప్పటికీ కొంతమంది మాంసాహారాలను ప్రతిరోజు తింటూనే ఉన్నారు. మన పూర్వీకులు తీసుకు వచ్చిన ఏదో ఒక సాంప్రదాయం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉండనే ఉంటుంది