Weight loss : మారుతున్న కాలం కొద్ది సమయానుగుణంగా ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఎన్నో మార్పులు ఏర్పడతాయి.. ముఖ్యంగా మనం సమయం లేక తీసుకునే ఆహారం వల్ల ఎక్కువగా అధిక బరువు వస్తోంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజుకు మూడు పూటలా తినాలి అన్న నియమాన్ని పక్కకుపెట్టి.. ఒకేసారి ఎక్కువ తినకుండా.. రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు కొంచెం కొంచెం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడి తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.. తీసుకునే ఆహారం కూడా పోషకాహారమై ఉండాలి.. ఇకపోతే బరువును తగ్గించే ప్రయత్నంలో ఈ చిన్న చిట్కాలను మేము మీకోసం తీసుకొచ్చాము.. ఇక ఆ చిట్కాలేంటో తెలుసుకొని మీరు కూడా పాటిస్తే కేవలం ఈ ఆహార పదార్థాల ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.

పుట్టగొడుగులు : చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరని చెప్పాలి. మాంసం లో దొరికే మాంసకృత్తులు పుట్టగొడుగుల లో మనకు లభిస్తాయి. వీటిలో ఉండే పోషకాల కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి బరువు పెరుగుతారని ఆస్కారం కూడా ఉండదు . అంతే కాదు శరీరానికి కావల్సిన నీరు కూడా ఈ పుట్టగొడుగుల ద్వారా మనకు లభిస్తుంది.
పుచ్చకాయ : వేసవికాలంలో దొరికే ఈ పుచ్చకాయ వల్ల శరీరానికి కావల్సిన నీరు అందడమే కాకుండా అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. పుచ్చకాయ తినగానే మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది.. కాబట్టి ఇతర ఆహార పదార్థాల పై దృష్టి మరలదు. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
పెరుగు : పెరుగులో ఉండే క్యాల్షియం మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపి బరువు తగ్గేలా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు పూటలా తప్పకుండా పెరుగును ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలి.
కీరదోస : కీరదోస లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు త్వరగా తగ్గుతాయి.
బాదంపప్పు : ఇందులో ఉండే పీచు పదార్ధం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. న్యూట్రీషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అధికంగా ఉండటం వలన బాదం బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. బాదం నమిలి తినటం వలన రిలీజ్ అయ్యే ఫ్యాట్స్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. తద్వారా ఆకలి వేయదు ఫలితంగా బరువు తగ్గుతారు.