Health Problems : తేనే అనేది శరీర ఆరోగ్యాన్ని పెంపొందించడానికి..చర్మ సంరక్షణకు.. జుట్టు సమృద్ధి గా పెరగడానికి ఉపయోగపడుతుంది అని అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల లో ఇంటి నుండి చేసుకునే ఫేస్ ప్యాక్ లలో కూడా తేనెను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ తేనె వల్ల ముఖం తాజాగా కోమలంగా ఉంటుంది అని ఉపయోగిస్తారు. ఇక అంతే కాదు ఆరోగ్యానికి కూడా తేనె అనేది చాలా ప్రయోజనకారి .. కానీ మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే దీనినుండి కలిగే పోషకాలు లభిస్తాయి.. ఇక అమితంగా తినడం వల్ల కలిగే నష్టాలు కూడా లేకపోలేదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే తేనెను అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఎక్కువ మోతాదులో తేనెను తినడం వల్ల మొదటగా దంతాలపై ప్రభావం పడుతుంది. అంతేకాదు ఎక్కువగా బ్యాక్టీరియా దంతాలపై పేరుకుపోయి పాచి, దంత క్షయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా నోటి నుండి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ తినాలి అనుకుంటే తేనె తిన్న తరువాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.ఎక్కువ మోతాదులో తేనె ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు డయేరియా, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.

ఇక తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోగా జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతాయి.అధిక రక్తపోటు ఉన్నవారు తేనెను తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది అట.సాధారణంగా చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగుతూ బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు అధికంగా తేనెను కలిపి తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేవలం పావు చెంచా మాత్రమే తేనె కలుపుకొని తాగడం మంచిది.