Regi Pandu Benefits : సాధారణంగా రేగుపండ్లు అనగానే అందరికీ సంక్రాంతి గుర్తొస్తుంది. ఇక పోతే సంక్రాంతి పండుగ అయిపోయింది కాబట్టి రేగుపండ్లు కూడా పిల్లలకు పోసే ఉంటారు.. ఇకపోతే ఈ రేగుపండ్లు చలికాలంలోనే ఎక్కువగా లభిస్తాయి కాబట్టి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.. సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా శీతాకాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలానికి కావలసినట్టుగా అన్ని పోషకాలు ఉండే పండ్లు కూడా మనకు లభిస్తున్నాయి.ఇకపోతే అన్ని పోషకాలు ఉండే పండు ఏది అంటే అది రేగుపండు అని చెప్పవచ్చు..
ఇకపోతే ఈ సీజన్లో దొరికే ఈ పండ్ల వల్ల మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.. రేగు పండ్లు తినడం వల్ల కమలా పండు కంటే ఎక్కువ స్థాయిలో విటమిన్ సి మనకు లభిస్తుంది. అందుకే ఇది తల లో వచ్చే చుండ్రును మొదులుకొని స్కిన్ కి వచ్చే సమస్యల వరకూ అన్నింటినీ నయం చేస్తుంది. చర్మం పై వచ్చే చర్మ సమస్యలను దూరం చేసి చర్మానికి కాంతిని అందించడంలో సహాయపడతాయి. ఇంకా వీటి లో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.. కాబట్టి బరువు పెరుగుతారనే సమస్య కూడా ఉండదు.రేగు పండ్లలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా లభించడం వల్ల ఎటువంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. అంతే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ముఖ్యంగా రేగు పండులో ఉండే పొటాషియం వల్ల బీపీ లెవల్స్ కూడా రెగ్యులేట్ చేయబడతాయి. ఇకపోతే రేగు పండ్లు తినడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గించుకోవచ్చు.. రీసెంట్ గా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 22 శాతం భారతీయులు ఈ కాన్స్టిపేషన్ తో బాధ పడుతున్నారట. అందుకే ప్రతి రోజూ నాలుగు రేగుపండ్లను నోట్లో వేసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది అని అధ్యయనాలు వెల్లడించాయి.అంతే కాదు చక్కటి నిద్రను సొంతం చేస్తాయి.. యాంగ్జైటీ ని తగ్గించి సాంత్వన చేకూరుస్తాయి. రక్త ప్రసరణ కు కూడా సహాయపడి.. ఎముకల బలానికి కూడా తోడ్పడతాయి.