Gongura : గోంగూర తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Gongura : తెలుగువారు గోంగూర అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొందరికి గోంగూర లేకుంటే ముద్దు కూడా దిగదు అంటే అతిశయోక్తి కాదు. గోంగూర రుచికే కాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.గోంగూరలో చాలా ఆయుర్వేద గుణాలున్నాయి.గోంగూర తో పచ్చడి కానీ, పప్పు కానీ చేసుకొని తినొచ్చు. వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..!

Gongura : వ్రణాలు లేదా ఏదైనా గడ్డలపై..

మగ వారిలో వ్రణాలుంటే వాటిని గోంగూర తినడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు. వ్రణాలు లేదా ఏదైనా గడ్డలపై ఆముదంలో గోంగూర ఆకుల్ని ముంచి అక్కడ పెట్టుకుంటే,గడ్డలు ఈజీగా తగ్గిపోతాయి. కొందరికి ఎన్ని రోజులైనా గడ్డలు అలాగే ఉండి ఇబ్బంది కలిగిస్తుంటాయి.అలాంటి వారు ఇలా చేస్తే వెంటనే అవి పగిలిపోతాయి.

Gongura : రేచీకటికితో ఇబ్బందులు..

కొందరు రేచీకటికితో ఇబ్బందిపడుతుంటారు.అలాంటి వారు తరచూ గోంగూర కర్రీ కానీ,గోంగూర పచ్చడిని కానీ కనీసం పప్పు అయినా రోజూ వారి ఆహారంలో తీసుకువాలి.ఇలా తీసుకుంటే ఇందులో వుండే విటమిన్ ఎ రేచీకటిని తగ్గిస్తుంది.

Gongura : గోంగూర పూలతో..

అలాగే గోంగూర పూలతో కూడా రేచీకటిని నివారించొచ్చు. ముందుగా గోంగూర పూలను బాగా దంచి,రసాన్ని తీసుకోవాలి.దాన్ని పాలలో కలిపి త్రాగితే రేచీకటికి త్వరగా పరిష్కారం అవుతుంది.

Do you know the benefits of eating gongura
Do you know the benefits of eating gongura

బోదకాలు సమస్యకు.. కొంతమందికి బోదకాలు సమస్య ఉంటుంది. అది తగ్గేందుకు కూడా గోంగూర బాగా సహాయపడుతుంది. కొన్ని గోంగూర ఆకులను, వేప ఆకులను మిక్స్ చేసి,ఆ మిశ్రమాన్ని బోదకాలుపై లేపనంలా వేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.

విరోచనాలకు గురయ్యే వారు..

ఎక్కువ విరోచనాలతో బాధపడేవారు కూడా గోంగూరతో మంచి ఫలితాన్ని పొందొచ్చు. గోంగూర లో నుంచి జిగురు తీసి,దాన్ని వేడి నీటిలో కలుపుకుని తాగితే వీరేచనాలు ఇట్టే తగ్గిపోతాయి.

దగ్గు, ఆయాసం..
కొంతమంది దగ్గు, ఆయాసంతో నిత్యం బాధపడుతుంటారు. అలాంటి వారు కూడా గోంగూరను రోజూ తింటూ వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

షుగర్ నియంత్రణ..
షుగర్ తో బాధపడేవారు రోజూ గోంగూరతో తయారు చేసిన ఆహారపదార్థాలు తింటే చాలా ఉపయోగకరం. దీంతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

చాలా రకాల విటమిన్స్..
గోంగూరలో విటమిన్ ఏ, సి వంటి విటమిన్స్ ఉంటాయి. దీంతో కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే దంత సమస్యలును కూడా ఈజీగా తగ్గిపోతాయి. గోంగూరలో క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల,ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా సహాయపడుతుంది .