Health Benefits : కొర్రలు మానవునికి ఆరోగ్య ప్రయోజనాల పుట్ట.. అని మీకు తెలుసా..?

Health Benefits : కొర్రలు చిరుధాన్యలలో ఒకటి.పూర్వం భారతీయ వంటకాలలో చిరుధాన్యలను ఎక్కువగా ఉపయోగించే వారు. రాగులు, సజ్జలు, కొర్రలు, సాములు, అరికలు వంటి చిరుధాన్యలను తిని వారు బలంగా, పుష్టిగా ఉండేవారు. కొర్రల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే అన్నం మానేసి కొర్రలు తినడం మొదలు పెడతారంటే అతిశయోక్తి లేదు. కొర్రలు రుచికి తీయగా, కొంచెం వగరుగా వుంటాయి. కడపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం ఇంకా మోషన్స్ వంటి సమస్యలకు కొర్రలు మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు . వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఉభాకాయం సులభంగా తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి.ఇందులో పైబర్ ఎక్కువగా వుండటం వలన మలబద్దకాన్ని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు.

గుండెజబ్బులు, రక్తహీనత, ఉబకాయం, కీళ్ళవాతం, రక్తస్రావం ఇంకా అలాగే కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.ఇంకా అలాగే ముసలితనములో వచ్చే మతిమరుపు ను కూడా తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచటంలో ఉపయోగపడతాయి . ఇక నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. బెల్స్ పాల్సీ ఇంకా మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఎంతగానో సహాయపడుతుంది.అలాగే ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఇనుము అధికంగా ఉండటం వలన అనిమియా నివారణకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది . వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది.ఈ కొర్రలు శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి.

Do you know that millets have health benefits for humans
Do you know that millets have health benefits for humans

ఇంకా నడుముకు మంచి శక్తిని ఇస్తాయి.నిద్రలో పక్కలో మూత్రం పొసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ బాగా మెరుగుపడుతుంది,ఆ సమస్యను ఈజీగా అదిగమించొచ్చు. లంగ్స్ కి సంబంధించి ఇన్ఫెక్షన్లను, న్యుమోనియాను ఇంకా షుగర్ వ్యాధితో బాధపడేవారికి, అరికాళ్ళ మంటలను ఇంకా స్పర్శ కోల్పోవడం వంటి పరిస్థితులను నయం చేస్తాయి. ఇంకా అలాగే నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ బాగా సహాయపడుతుంది. కొర్రలను రెగ్యులర్‌గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా కాపాడుతుంది. అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులుకు మంచి విరుగుడేనని చెప్పొచ్చు.మగవారిలో నరాల బలహీనతలకు సరైన ఆహరం కొర్ర బియ్యంగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల చర్మ రోగాలను పారద్రోలేందుకు, నోటి కాన్సర్, ఉపిరితిత్తుల కాన్సర్, ఉదర కాన్సర్, పార్కిన్సన్ రోగం ఇంకా అలాగే ఆస్తమా నివారించడంలో సైతం కొర్రలు బాగా ఉపయోగపడతాయి.