Health Tips : ఈ తీగ మొక్కతో నూరు రోగాలకు పైగా నయం.. అసలు వదలకండి..!

Health Tips : తీగజాతి మొక్కలలో సర్వరోగ నివారిణి అయినా తిప్పతీగ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తాయి. ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రథమ స్థానం కలిగి ఉంది. ఈ మొక్క బహు వార్షిక రకానికి చెందిన తీగజాతి మొక్క అని చెప్పవచ్చు. ఏ కాలంలో అయినా సరే పచ్చగా పెరుగుతూ ఉంటుంది. తిప్పతీగ వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ తీగ జాతి మొక్క అయిన తిప్పతీగను సంస్కృతంలో అమృతవల్లి అని కూడా పిలుస్తారు. అమృతం అంటే చావులేనిది అని అర్థం .. తిప్పతీగ మన ఇంట్లో ఉంటే ఎటువంటి రోగాలైనా సరే దూరం అవ్వాల్సిందే.

Do you know More than hundred diseases are cured with this thippa theega plant
Do you know More than hundred diseases are cured with this thippa theega plant

ఈ తిప్పతీగ చిన్న వేరుని తెచ్చిపెట్టినా సరే విచ్చలవిడిగా పెరుగుతుంది. పెద్దగా నీరు కూడా అవసరం లేదు. ఇక తీగకు చావు ఉండదు. తిప్పతీగ మనీ ప్లాంట్ వలె విస్తారంగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బీపీ , షుగర్ ,జీర్ణశక్తి తగ్గడం వంటి సమస్యలకు తిప్పతీగ ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. తిప్పతీగ ఆకులు మరియు కాండం నుంచి తీసిన రసాన్ని రోజు వాడడం వల్ల బిపి, షుగర్ వంటి సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు ఆకులను రోజు నమిలి మింగుతూ ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినా ఇట్టే దూరం అవుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వాళ్లు, ఆస్తమా, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా తిప్పతీగను ఉపయోగించవచ్చు.

ముందుగా ఒక ఐదు ఆకులను గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి.. నీరు సగం అయ్యేవరకు మరింత మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి ఆ నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. తిప్పతీగ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తటి పేస్ట్ చేసి ప్రతిరోజు ఉదయం గోలి సైజులో మింగినట్లయితే జలుబు నుండి మొదలుకొని పెద్ద పెద్ద జ్వరాలు వరకు దూరం చేసుకోవచ్చు. తిప్పతీగ రసాన్ని తీసుకోవడం వల్ల తెల్ల రక్త కణాల చురుకుగా పనిచేస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఈ తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తిప్పతీగలో 35 రకాల ఔషధ గుణాలు ఉంటాయని నిరూపితమైంది. 2016లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అరోమాటిక్ లక్నో వారు మన భారతదేశంలో ఉన్న ఈ తిప్పతీగపై పరిశోధనలు జరిపి వైరస్ బ్యాక్టీరియాను నశింప చేసే శక్తి కలిగి ఉందని నిరూపించారు.

తిప్పతీగ తీసుకోవడం వల్ల మన శరీరంలోని మోనోసెల్స్.. మైక్రో సెల్స్ గా మారి మన శరీరంలోకి ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయట.. కాళ్లు, చేతులు మంటలు వచ్చే వారు కూడా తిప్పతీగ ఆకుల రసాన్ని మర్దన చేసినా సరే ఉపశమనం కలుగుతుంది. తిప్పతీగను బెల్లంతో కలిపి తీసుకుంటే మలబద్ధకం దూరమైపోతుంది .అలాగే తిప్పతీగ రసాన్ని చక్కెరతో కలిపి తీసుకుంటే వేడి తగ్గిపోతుంది. తేనెలో కలిపి తీసుకుంటే కఫం తగ్గిపోతుంది. అలాగే ఆముదంతో కలిపి తీసుకుంటే రక్తవాతం పోతుంది. ఇలా నూటికి పైగా రోగాలను దూరం చేసే శక్తి ఈ తిప్పతీగకు ఉంది.