Pneumonia Complications : సాధారణంగా న్యుమోనియా సమస్య అనేది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు.. అలాగే 70 సంవత్సరాల పైబడి ఉన్న వృద్ధులకు ఈ సమస్య ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య రావడానికి గల కారణం ఏమిటంటే కాలుష్య కారకాలు, రసాయనాలు, విషపూరిత పొగ లకు గురి కావడం, చెడు లైఫ్ స్టైల్ వల్ల ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, పోషకాహారలోపం, జీవనశైలి అలవాట్ల వల్ల ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి సమస్యతో బాధ పడుతున్న వారు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు . ముఖ్యంగా దగ్గు, ఊపిరి ఆడకపోవడం, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.
న్యూమోనియా సమస్యను ఎలా నివారించాలి అనే విషయానికి వస్తే.. యాంటిబయోటిక్స్ బ్యాక్టీరియా న్యూమోనియాకి చికిత్స గా పనిచేస్తాయి. ఇక డాక్టర్లు ఒక్కొక్కసారి యాంటీవైరల్ మందులను కూడా సూచిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో న్యూమోనియా వైరస్ ను తగ్గించడానికి యాంటీవైరల్ మందులను కూడా సూచిస్తారు. ఇక అలాగే లక్షణాల యొక్క తీవ్రతను బట్టి అదనపు చికిత్సలను కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక రక్తంలో ఆక్సిజన్ స్థాయి కనుక తక్కువగా ఉంటే ఆక్సిజన్ థెరపీ ని మీకు వైద్యులు అందిస్తారు.
ఫ్లూ వైరస్ వల్ల వచ్చే న్యూమోనియా నివారించడానికి కొన్ని రకాల టీకాలు బాగా సహాయపడుతాయి. పోషక ఆహారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ధూమపానం చేయకపోవడం , మద్యపానానికి దూరంగా ఉండడం , ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో చేయడం లాంటివి చేయడంవల్ల న్యుమోనియా సమస్యను నివారించుకోవచ్చు. ముఖ్యంగా దుమ్ము, ధూళిలో తిరగకపోవడం మంచిది.. తప్పని పరిస్థితులలో వెళ్లాల్సివస్తే కచ్చితంగా ముక్కుకు, నోటికి మాస్కు ధరించాలి. ఇక సాధ్యమైనంతవరకు గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి .ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే న్యుమోనియా సమస్య నుంచి బయట పడవచ్చు.