Health Benefits : వేసవి కాలం రానే వచ్చింది .. ఇలాంటి పరిస్థితులలో చర్మం నుంచి ఎక్కువగా నీరు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది.. అలాంటప్పుడు శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువ. ఎప్పుడైతే శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుందో అప్పుడు అవయవాల పనితీరు కూడా నెమ్మదిస్తుంది . చర్మం పొడిబారిపోవడం, పెదవులు పగిలిపోవడం ఇలాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే కొన్ని రకాల పండ్లను ముఖ్యంగా ఈ వేసవికాలంలో దొరికే పండ్లను తినాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకునే ఆ పండ్లు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

1. బొప్పాయి : బొప్పాయి నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గించే ప్రయాణంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అని రుజువు చేయబడింది. బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి చక్కగా జీర్ణ క్రియ పనిచేయడానికి సహాయపడుతుంది. బొప్పాయి నీటి శాతాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఎక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది.
2. పుచ్చకాయ : విటమిన్ సి పుష్కలంగా లభించి.. పుచ్చకాయ వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. 90 శాతం నీటి తో కూడి ఉండడం వల్ల.. పుచ్చకాయను ఈ ఎండాకాలంలో ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉండదు. అంతేకాదు పుచ్చకాయలో సహజమైన చక్కెర ఉంటుంది కాబట్టి ఇది శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.
3. లిచ్చి : ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఈ లిచ్చి పండ్లు అధికంగా లభిస్తాయి. ఈ పండు చూడడానికి ద్రాక్ష పండు వలే కనిపిస్తూ లోపల జెల్ రూపంలో ఉంటుంది. ఇక ఆకలిని అదుపు లో వుంచి.. నీటి కొరతను తీర్చే మంచి పండు అని చెప్పవచ్చు. రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కాబట్టి వేసవి కాలంలో ఈ పండ్లను తింటే నీటిశాతం ఎక్కువగా లభిస్తుంది.
4. పైనాపిల్ : పుల్లటి రుచిని కలిగి ఉండే ఈ పైనాపిల్ తినడం వల్ల వల్ల శరీరానికి కూడా విటమిన్ సి తో పాటు నీరు శాతం అధికంగా లభిస్తుంది. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు.