Weight loss : అధిక బరువును దూరం చేసే ఈ ఔషధం గురించి మీకు తెలుసా..?

Weight loss : ఎవరినైనా చులకనగా చేసి మాట్లాడాలంటే.. ఆ వాడేంతలే కూరలో కరివేపాకంత అంటుంటారు కదా. కానీ అలాంటి కరివేపాకు కు గల ఆయుర్వేద గుణాలు తెలిస్తే ప్రతి రోజూ ఆహారంలో తప్పక చేర్చుకుంటారు..ఉదయాన్నే పరgడుపున నాలుగు ఆకులను తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో ఔషదగుణాలను అందిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అధిక బరువు.. కరివేపాకులో మైహోనింబిన్ అనే రసాయనం ఉండడం వల్ల శరీరంలో ని అధిక కొలస్ట్రాల్ ను కరిగించడానికి మరియు ట్రై గ్లిజరేట్స్ అంటే రక్తంలో ఉండే చెడు కొవ్వులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ట్రై గ్లిజరేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు రావడానికి దోహదం చేస్తుంది. కరివేపాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవితంలో ఎప్పుడూ గుండెజబ్బులు రావని ఆయుర్వేద నిపుణులు మరియు శాస్త్రవేత్తలు పరిశోధించి మరీ నిరూపించారు.

అల్జిమర్స్.. అల్జిమర్స్ ఎక్కువగా వయసు మళ్ళినవారిలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ జబ్బు రావడం వల్ల అధిక మతిమరుపు రావడం, బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది.దీనికి కూడా కరివేపాకు మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇందులో మెదడు కణజాలాన్ని వృద్ధి చేసేగుణం ఉంటుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మెదడులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది.

Do you know about this drug that can remove excess Weight loss
Do you know about this drug that can remove excess Weight loss

క్యాన్సర్.. యాంటీ ఆక్సిడెంట్ అయినా లినిలాల్,అల్పా టార్పిలిన్, మెర్సీలిన్, ఆల్ఫా టిలిన్ వంటివీ అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ కారకమైన ప్రీ ర్యాడికల్స్ నాశనం చేయడానికి రక్తంలో ప్రతిదేహాలను వృద్ధి చెందేలా చేస్తుంది.

అనీమియా తగ్గిస్తుంది : కరివేపాకును ఏదో ఒక విధంగా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనీమియాను నివారిస్తుంది. ఇది పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న ఆయుర్వేద చిట్కా.కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో ఐరన్ ను ప్రోత్సహిస్తుంది. ఆక్సిజన్ సప్లై చేయడానికి ఎక్కువ సహాయపడుతుంది.

కళ్ళ ఆరోగ్యం.. కరివేపాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగ పడుతుంది . కరివేపాకును రోజువారీ ఆహారం లో తీసుకోవడం వల్ల కళ్ళకు సంబంధించిన జబ్బులను నివారించుకోవచ్చని , శాస్త్రవేత్తలు పరిశోదించి మరీ నిరూపించారు

కరివేపాకును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు విషయంలో ఇది చాలా గొప్ప చిట్కా అని చెప్పొచ్చు . ఎలాంటి జుట్టు సమస్యలైనా నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది . కేవలం జుట్టు సమస్యలు మాత్రమే కాదు, అజీర్తి, అనవసర యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది. దీని నుండి పెక్టిక్ అల్సర్ ను నివారించుకోవచ్చు .కరివేపాకు పొడిని భోజనం చేసేటప్పుడు మొదట ముద్దలో కలిపి తినడం వల్ల పొట్టలో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు.