Health Benefits : మొలకెత్తిన గింజలను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సైతం తెలుపుతున్న విషయం తెలిసిందే. అందుకే పెసలు, శెనగలు, రాగులు, అలసందలు ఇలా మనకు అందుబాటులో ఉండే వాటితో మొలకలెత్తించి మరీ తింటూ ఉంటాము.. ముఖ్యంగా అల్పాహారంలో భాగంగా ఇలా మొలకెత్తిన గింజలను తినడం వల్ల రోజంతా ఆరోగ్యంగా .. ఫిట్ గా ఉండడానికి వీటిలో ఉండే పోషకాలు మన కు బాగా సహాయపడుతాయి. మొలకెత్తిన గింజలలో మనకు యాంటీఆక్సిడెంట్స్ తోపాటు విటమిన్ ఏ , విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి1 అండ్ విటమిన్ బి 6 తో పాటు విటమిన్ కే వంటి విటమిన్లు మనకు ఎక్కువగా లభిస్తాయి.
ఇతర పోషకాల విషయానికి వస్తే.. ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ ,పొటాషియం, పీచు పదార్థాలు వంటి పోషకాలు అధికమొత్తంలో మనకు లభిస్తాయి. మొలకెత్తిన గింజలలో విటమిన్ ఎ ఎనిమిది రెట్లు అధికంగా లభిస్తుంది.. అలాగే 35 శాతం వరకు మాంసకృతులు కూడా లభిస్తాయి.. ఈ గింజలు తినడం వల్ల జీర్ణ సంబంధిత, కడుపు ఉబ్బరంగా వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అంతేకాదు గుండె జబ్బుల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మొలకెత్తిన గింజలు మన శరీరానికి మంచి న్యూట్రిషన్ గా పనిచేస్తాయి.వీటిలో ఉండే పోషకాలు జుట్టు, చర్మం, గోళ్లు సహజంగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడతాయి.

ఇక శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయడానికి అలాగే రక్తంతోపాటు ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేయడానికి కూడా మొలకెత్తిన గింజల లో ఉండే పోషకాలు సహాయపడతాయి. ఇక తెల్ల రక్త కణాల అభివృద్ధికి రోగనిరోధకశక్తిని పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్-సి కారణంగా జుట్టు పొడవుగా పెరగడంతో పాటు ముఖం కూడా అందంగా మారుతుంది.ఇక బరువు తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. శరీరంలోని మెటబాలిజంను రేట్ ను పెంచి శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.