Hair Tips : తలకి ఆయిల్ రాస్తున్నా జుట్టు ఊడుతోందా? వెంటనే ఇలా చేయండి !

Hair Tips : తలకు కొబ్బరి నూనె లేదంటే హెయిర్ ఆయిల్స్ రాసుకుంటే.. జుట్టు తెల్లబడకుండా, జుట్టు ఊడిపోకుండా ఉంటుందని చాలా మంది తలకు నూనె రాసుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏయే సమయాల్లో తలకు నూనె రాయకూడదో తెలుసుకుందాం..

Advertisement

Advertisement

తలపై చర్మం జిడ్డుగా ఉన్నప్పుడు జుట్టుకు ఎక్కువ నూనె రాయకూడదు. జిడ్డు చర్మానికి నూనె రాసుకుంటే జుట్టు కింద చర్మంపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. దీని కారణంగా జుట్టు ఊడిపోతుంది. తలలో చుండ్రు ఎక్కువ ఉంటే నూనె రాసుకోకూడదు. చుండ్రు ఎక్కువుగా ఉన్నప్పుడు నూనె రాసుకోవడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు తలపై జుట్టు కింద బొబ్బలు ఉంటాయి.

ఈ సమయంలో జుట్టుకు నూనె రాయడం వల్ల పొక్కులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తల స్నానానికి కనీసం గంట ముందు హెయిర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. రాత్రి జుట్టుకు నూనె రాసుకుని మసాజ్ చేసి ఉదయం తల స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కానీ తన స్నానం చేసే కొన్ని నిమిషాల ముందు మాత్రం నూనె రాసుకుని తల స్నానం చేయకూడదు. తల తడిగా ఉన్న సమయంలోనూ నూనె రాయకూడదు. ఆరిన తర్వాత రాసుకోవాలి. ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

 

Advertisement