Diabetes : మారుతున్న జీవనశైలి .. ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో డయాబెటిస్ రోగులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో డయాబెటిస్ వారు ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. నిజానికి వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది జ్యూసు తాగుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యూసులు తాగవద్దు కూల్డ్రింక్స్ జోలికి అసలే వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి శరీరానికి హానికరం మాత్రమే కాదు వాటిలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
అవసరమైతే పండ్ల రసాలను తీసుకుంటే మరింత మంచిది. వీటిలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ వేసవి కాలంలో డయాబెటిస్ రోగులు ప్రతిరోజు రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేస్తూ ఉండాలి. ఇక పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. అల్పాహారంలో ఓట్స్, ఓట్ మీల్ , ఆపిల్, బెర్రీ లు వంటివి తీసుకుంటే మరింత మంచిది. ఇక పైనాపిల్, సీతాఫలం లాంటి పనులకు దూరంగా ఉండాలి. మామిడి పండ్లను ఎండాకాలంలో అస్సలు తీసుకోకూడదు. రుచిగా ఉన్నప్పటికీ మధుమేహ రోగులకు విషం కంటే ఎక్కువ అని చెప్పాలి.
వేసవి కాలంలో కూడా సాధ్యమైనంత వరకు కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల కొంతవరకు శరీరానికి వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నానబెట్టిన బాదం లేదా మొలకెత్తిన గింజలను తినడం వల్ల డయాబెటిస్ సమస్యను కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు. కొబ్బరి నీళ్లు తాగాలి అనుకునేవారు కొబ్బరిని కూడా తినాలి . అప్పుడే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉండటం కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక డయాబెటిస్ వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు తెలియజేయాలి. కాబట్టి వారికి ఆర్టికల్ కు వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.