Health Tips : పొడిదగ్గు, ఎలర్జీ దగ్గు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు, ట్రీట్మెంట్..

Health Tips కొంతమందికి దగ్గు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే దగ్గు జలుబు వచ్చిన తరువాత పొడి దగ్గు ఒక నెల లేదా రెండు నెలల పాటు రోజు వరుసగా వేధిస్తూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి గొంతు, ముక్కు, సైనస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలర్జీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది.

సాధారణంగా కొంతమందికి ఎలర్జీ లేకపోయినా కూడా పొడి దగ్గు వస్తుంది. మరి కొంతమందికి చల్లటి గాలి తగలగానే ముక్కు కారిపోవడం, తుమ్ములు రావడం జరుగుతుంది. అట్లాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వచ్చిన తరువాత రెండు నెలలు , ఒక నెలపాటు లేదంటే 15 రోజులపాటు పొడి దగ్గు వస్తుంది. పొడి దగ్గు ఏం చేసినా కూడా తగ్గదు. గట్టిగా ఊపిరి తీసుకున్న కూడా దగ్గు వస్తుంది. ఈ దగ్గు కొంతమందికి పిల్లి కూతలతో పాటు వస్తుంది. ఈ దగ్గు వచ్చేటప్పుడు కుయ్ కుయ్ మని చాతిలో నుంచి సౌండ్ వస్తుంది. ఇది ఆస్తమా వల్ల వస్తుంది.. దీనిని కాఫ్ వేరియంట్ ఆస్తమా అని అంటారు.

జలుబు దగ్గు వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. జలుబు దగ్గు వచ్చిన తర్వాత ఇలా వచ్చే పొడి దగ్గు ని నయం చేసుకోవడానికి.. ప్రతి రోజు Monte Lucast టాబ్లెట్ తో పాటు లివో సిట్రిజెన్ కాంబినేషన్ ఉంటుంది. ఈ టాబ్లెట్లు ప్రతిరోజు 15 రోజులపాటు వేసుకుంటే తగ్గిపోతుంది. ఒకవేళ ఇలా మెడిసిన్ 15 నుంచి 20 రోజులపాటు వాడినా కూడా తగ్గకపోతే .. అప్పుడు ఆస్తమా ఉన్నట్టు అప్పుడు ఇన్హేలర్ తీసుకుంటే తగ్గిపోతుంది.