BEAUTY Benefits : చాక్లెట్ అంటే చాలు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటుంటారు.. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే చాక్లెట్స్ రకరకాల ఆకారాలలో.. రకరకాల రుచులలో మనకు లభ్యమవుతున్నాయి.. ఇకపోతే అన్ని చాక్లెట్లలో కన్నా డార్క్ చాక్లెట్ కి ఉన్న ప్రత్యేకత వేరు అని చెప్పాలి. సీజన్ మారినా సందర్భం ఏదైనా ఈ డార్క్ చాక్లెట్ తప్పకుండా తినాల్సిందే.. ఇకపోతే ప్రేమికుల రోజు లలో ప్రత్యేకంగా ఈ డార్క్ చాక్లెట్ కు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది.. ఎవరైనా సరే తమకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేయడానికి ముందుగా ఈ డార్క్ చాక్లెట్ ను ప్రెజెంట్ చేస్తూ ఉంటారు..
ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ డార్క్ చాక్లెట్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు సౌందర్య నిపుణులు..ఇకపోతే ఈ చాక్లెట్ చర్మానికి చాలా మేలు చేస్తుందట.. అంతేకాదు ఈ చాక్లెట్ లో చర్మ సౌందర్యాన్ని పెంపొందించే పోషకాలు, ఖనిజాలు కూడా ఉన్నాయి.. చాక్లెట్ ను ఉపయోగించి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకొని మీరు కూడా అందంగా మెరిసిపోవచ్చు అని చెబుతున్నారు బ్యూటీషియన్స్. ఇకపోతే చాక్లెట్ చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే చాక్లెట్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి.
. చాక్లెట్ లో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.. అంతే కాదు ఇందులో మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉండడం వల్ల చర్మం సులభంగా వీటిని గ్రహిస్తుంది.ఇక చర్మ కణాలకు మంచి పోషణను అందిస్తాయి.. చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ , ఖనిజాల కారణంగా ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షిస్తాయి.. ఇక ఇందులో ఉపయోగించే కోకో పౌడర్ చర్మానికి గొప్ప ఎక్స్ ఫోలియెట్ గా పనిచేస్తుంది. ఇక డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో సహాయపడి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.. చాక్లెట్ పౌడర్ లో కెఫిన్ కూడా ఉండటం వల్ల చర్మం మృదువుగా, అందంగా, తాజాగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతాయి..