Hair Problems : అమ్మాయి ఎంత అందంగా ఉన్నప్పటికీ.. కురులు కూడా అంతే అందంగా, పొడవుగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని గింజలను గనుక జుట్టుకు వాడినట్లయితే జుట్టు సమస్యలు ఏవైనా సరే శాశ్వతంగా తొలగిపోవాల్సిందే. అయితే జుట్టు సమస్యలను దూరం చేసే ఆ గింజలు ఏమిటంటే అవిసె గింజలు. అవిసె గింజలు పూర్తిస్థాయిలో తేమను అందిస్తాయి.. ఈ అవిసె గింజల వల్ల వికృతమైన, నిర్జలీకరణం అయిన జుట్టును అందంగా మార్చడానికి చాలా చక్కగా పనిచేస్తాయి.
ఈ అవిసగింజలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభించడం వల్ల జుట్టు చాలా మృదువుగా మెత్తగా తయారవడానికి సహాయపడతాయి.. అయితే ఈ గింజలు మనకు ఎలా ఉపయోగించాలి అంటే ప్రస్తుతం మార్కెట్లో అన్నీ ఆటోమేటిక్ గా లభిస్తున్నాయి. కాబట్టి ఈ అవిసెగింజల ద్వారా తయారు చేసిన నూనెను కూడా అమ్ముతున్నారు. అంతేకాదు అవిసె గింజల జెల్ ను కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే జుట్టు సమస్యలు పోగొట్టే జుట్టును అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఈ అవిసె గింజల నుండి తీసిన నూనెను ఉపయోగించాల్సిందే.ఈనూనె ను వారానికి రెండుసార్లు ఉపయోగించడం

వల్ల జుట్టు మీద వచ్చే చుండ్రు, చికాకు, దురద, జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం , ఊడిపోవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ నూనెను పట్టించడం వల్ల అన్ని సమస్యలు తొలగి పోవడం తో పాటు కొత్త జుట్టు రావడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉత్తమ మార్గాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది . కాబట్టి మీ జుట్టు సమస్యలు ఏవైనా ఉంటే మార్కెట్లో దొరికే వీటిని కొనుగోలు చేసి జుట్టుకు అప్లై చేయండి. జుట్టు ఒత్తుగా, పొడవుగా కూడా మారుతుంది.ఇక ఈ నూనె వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోక మానరు.