TEA : ఈ తొలకరి జల్లుల కాలంలో అనేక వైరస్ ల కారణంగా పిల్లలకు, పెద్దలకు తేడా లేకుండా వైరల్ పీవర్లు, జలుబు, దగ్గు అంటూ ఎన్నో సమస్యలు వచ్చి పడుతుంటాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం ఎక్కువ పాడయే సీజన్ ఇదే అని చెప్పొచ్చు.మన శరీరం వైరస్ లతో పోరాడటానికి మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎన్ని రకాల వైరస్ లు కానీ, బ్యాక్టీరియా లు శరీరాన్ని చుట్టుముట్టిన కానీ అది శరీరాన్ని అవలీలగా కాపాడుతుంది.మన శరీరంలో ఉండే చెడు కొలేస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించడానికి, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యాంగా, బలంగా చేయటానికి ఈ ఒక్క టీ వల్ల సాధ్యం అవుతుంది.అదేంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ టీ కోసం ఉసిరి, అల్లం వేసి చేయాలి.
ఉసిరి మరియు అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కళంగా ఉంటాయి.వీటి వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను బయటకి పంపుతుంది మరియు యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఫ్రీరేడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధి చెందకుండా చేస్తుంది.అలాగే ఉభకాయం తగ్గడానికి మంచి ఔషదంగా పనిచేస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో మన జీవక్రియరేటు తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇందులో వాడే ఉసిరి మన మెటబాలిజంను పెంచుతుంది. అప్పుడు మన శరీరంలో యాక్టివ్ గా ఉండి కొవ్వు కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలి తగ్గించి తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఉసిరి మరియు అల్లం ఈ రెండు కూడా శరీరంలో వేడిని తగ్గించి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఉసిరి, అల్లం రెండింటిలోనూ విటమిన్ సికి పుట్టిన ఇల్లు అంటే అతిషయోక్తి కాదు.ఈ డ్రింక్ లో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ పెంచడంలో సహాయపడి వృద్ధాప్య ఛాయలు చిన్న వయస్సులోనే రాకుండా చేస్తాయి. ఇక ఈ టీ ఎలా తయారుచేయాలో చూద్దాం.స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టి నాలుగు కప్పులు నీటిని వేసి,దానిలో మార్కెట్లో దొరికే ఉసిరి పొడిని ఒక స్పూన్ వేయాలి.లేదంటే రెండు ఉసిరికాయలను ముక్కలుగా చేసి , ఒక స్పూన్ అల్లం తురుము వేసి,బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే కాఫీ,టీ బదులు ఇది తాగాలి. మధుమేహంతో బాధపడే వారు తేనె కలపకుండా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. వైరస్ ల నుండి కలిగే ఎన్నో రకాల జబ్బులను తగ్గిస్తుంది.