Hair Tips : క్యారెట్ మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు.. ముఖ్యంగా క్యారెట్ కంటి సమస్యలను నయం చేస్తుంది. అయితే క్యారెట్ జుట్టు సమస్యలను కూడా నివారిస్తుందని మీకు తెలుసా.!? జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఇప్పుడు చెప్పబోయే క్యారెట్ హెయిర్ మాస్క్ వేసుకుంటే.. జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది..!

క్యారెట్ హెయిర్ మాస్క్..
ఒక కప్పు క్యారెట్ రసం, అరకప్పు అవకాడో పేస్ట్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ , ఒక చెంచా పెరుగు అవసరం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ జ్యూస్ వేసుకోవాలి. మీ జుట్టుకి తగినంత వేసుకోవాలి. మీ జుట్టు పొడవుగా ఉంటే కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ముందుగా క్యారెట్ రసంలో అవకాడో మిశ్రమం వేయాలి. ఈ రెండింటిని బాగా చిక్కగా అయ్యేవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ , పెరుగు వేసి కలుపుకోవాలి. ఒక చెంచా రోజ్ మేరీ ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి.. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి.
జుట్టుకి కావలసిన విటమిన్ బి కాంప్లెక్స్ క్యారెట్ లో లభిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుని మృదువుగా తయారు చేయడంతో పాటు జుట్టుకి కావలసిన తేమను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి బి జుట్టుకి రక్తప్రసరణను అందించడంతోపాటు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.