BEAUTY Tips : వివాహం చేసుకోబోయే అమ్మాయిలు పెళ్లి లో తళుక్కుమని మేరవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. సాధారణంగా పెళ్లి అనగానే అందరి చూపు పెళ్లి కూతురు పైనే ఉంటుంది. అయితే ఆ సమయంలోని మరింత అందంగా కనిపిస్తే ఆ పెళ్లి పూర్తయ్యే వరకు కూడా అమ్మాయి అందం గురించే మాట్లాడుకుంటారు.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లు ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పకుండా పెళ్ళికి వచ్చే అందరి చూపులు మీ పైనే ఉంటాయి.. ఇకపోతే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. డిటాక్సింగ్ అని పిలిచే ఆహారంతో శరీరంలోని అన్ని విషపదార్ధాలను వదిలించుకోవడానికి ఉత్తమమైన మార్గం.
అయినప్పటికీ, అత్యంత ప్రభావవంతమైన ఫలితాలను పొందడానికి మనం కొంచెం జాగ్రత్తతో దీనిని అనుసరించాలి. డీటాక్స్ డైట్ అంటే మీరు రోజంతా జ్యూసులతో గడిపేయాలి అని అర్థం కాదు..మీరు తీసుకునే ఆహారంలో పోషక ఆహారం కలిగి వుండాలని అర్థం. ఇందుకోసం మీరు ఒక నెల ముందు రోజుల నుంచి ప్లాన్ చేసుకోవాలి మీ శరీరంలో ఉండే టాక్సిన్స్ ను వదిలించుకోవాలి అంటే ఒక నెల నుంచి ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి. ఇక ఈ ప్లాన్ లో మొదటి స్టెప్పు మీరు కాఫీ, టీ , ఆల్కహాల్ వంటి వాటితో పాటు షుగర్ పదార్థాలను పూర్తిగా మానేయాలి.సాధారణంగా కొంతమంది పెళ్ళికి వారానికి ముందు మాత్రమే ఇలాంటి డైట్ ఫాలో స్టార్ట్ చేస్తారు కానీ ఇది శరీరానికి ప్రమాదం కాబట్టి నెలరోజుల ముందు నుంచి ఈ డైట్ ను ఫాలో అవడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి.

అధికంగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి .. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పని చేసి శరీరంలో ఉండే వ్యర్థాలను త్వరగా బయటకు పంపిస్తుంది. ఇక తాజా కూరగాయలు, తాజా పండ్లు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యంతో పాటు తాజాదనం కూడా అందుతుంది.మీరు తీసుకునే రెగ్యులర్ టీని మానేసి గ్రీన్ టీ లేదా మేరీ గోల్డ్ టీ తాగాలి. అందం రెట్టింపు కావడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా పెళ్లి లో అందాల రాశి లా మెరిసి పోవచ్చు.